పవన్ – అలీ మంచి స్నేహితులు. అలీ నా గుండె కాయ అని పవన్ చాలా సార్లు చెప్పాడు. అలీ కూడా పవన్ ఉత్తముడని, నిజాయతీ పరుడని చాలాసార్లు కొనియాడాడు. అలాంటి అలీ… పవన్ ని వదిలేసి వై కా పా లో చేరిపోయాడు. అలీ ఇచ్చిన ఈ షాక్ పై పవన్ మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఎవరి ఇష్టాలు వాళ్లకి ఉంటాయి, జగన్ పార్టీ అలీ ని ఆకర్షించి ఉంటుంది అంటూ.. అలీ వ్యవహారాన్ని పవన్ ఇంతవరకూ లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు మాత్రం బయటపడిపోయాడు. రాజమండ్రి లో ఎన్నికల ప్రచార సభలో.. అలీ వ్యవహార తీరుపై తొలిసారి తనకు తానుగా మాట్లాడాడు పవన్.
అలీ తనకి మంచి స్నేహితుడని, చాలాసార్లు తనని ఆదుకున్నానని, అలంటి అలీ తనని, తన స్నేహాన్ని వదిలి వెళ్లిపోయాడని బాధపడ్డాడు. అలీ అడిగినందువల్లే తన కుటుంబ సభ్యుడికి నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని గుర్తుచేశాడు పవన్. ఎన్నికల ముందు ఎవరి గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో సమీకరించుకుని, జగన్ గెలుస్తాడని నమ్మి అలీ అటువైపు వెళ్లిపోయాడని, ఇదేనా స్నేహధర్మం అంటూ నిలదీసాడు. అందుకే తాను స్నేహితులని, కుటుంబ సభ్యులని నమ్మనని, తన నమ్మకం, తన బలం అభిమానులే అన్నాడు పవన్.