తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… ఆరోగ్యం బాగాలేకపోయినా… ప్రచారానికి వచ్చారు. ఒకే ఒక బహిరంగసభలో ప్రసంగించారు. ఆ సభలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. అంతే.. ఆ మరుక్షణం నుంచి టీఆర్ఎస్ నేతుల విరుచుకుపడ్డారు. తెలంగాణ గడ్డపై నుంచి ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించడం ఏమిటని మండిపడ్డారు. సోనియాకు ఎంత అహంకారం అని కేసీఆర్ కూడా.. విమర్శలు గుప్పించారు. కానీ.. ఇప్పుడు రాజకీయం మారిపోయింది. ఏపీలో… మిత్రుడు.. జగన్మోహన్ రెడ్డి.. తను పెడుతున్న ఫెడరల్ ఫ్రంట్‌లో ఉండాలంటే.. అదే ప్రత్యేక హోదాకు.. తాను మద్దతు పలకక తప్పని పరిస్థితి ఎదురయింది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఉన్న తమ విధానాన్ని మార్చుకున్నారు. అదే తెలంగాణ గడ్డపై నుంచి.. ఏపీకి ప్రత్యేకహోదా కు మద్దతిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే… తమ పరిశ్రమలన్నీ తరలిపోతాయని… సెంటిమెంట్ పెరిగేలా చేసుుకున్న టీఆర్ఎస్… ఇప్పుడు… అదే ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించండం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరిచేదే.
ఓ వైపు.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి… తాను, కేసీఆర్ కలిసి ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని… ప్రకటనలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం… ఏపీకి కేసీఆర్ అంత సుముఖంగా ఉంటే.. ప్రత్యేకహోదా ఇస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని… కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న కేసీఆర్… ప్రచార గడువు ముగిసే సమయంలో… ఏపీకి ప్రత్యేకహోదా మద్దతుగా ప్రకటన చేశారు. జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని.. ఇద్దరం కలిసి… ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని తన చివరి ప్రచారసభలో చెప్పారు. నిజానికి ఐదేళ్ల కాలంలో.. ఏపీకి ప్రత్యేకహోదా అనే ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణ వ్యతిరేకించింది. చివరికి.. ప్రత్యేకహోదా అంశంపై… కేంద్రంపై..టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా సమర్థించ లేదు. ఏపీకి ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. అసలు ప్రత్యేకహోదాలో ఏమేమి ఉంటాయో చెప్పాలని డిమాండ్ చేసింది.
టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కూడా మద్దతు ప్రకటించలేదు. వాకౌట్ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను పెంచడానికి.. ప్రత్యేకహోదాను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు… ఏపీలో జగన్‌కు ఉపయోగపడటానికి అనుకూలంగా ప్రకటన చేశారన్న భావన వ్యక్తమవుతోంది. ఇది కేవలం.. ప్రకటనే. నిజానికి… కొన్నాళ్ల కిందట… ఫెడరల్ ఫ్రంట్ గురించి.. ప్రస్తావన వచ్చినప్పుడు.. అవసరం అయితే… తాము ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. కేంద్రానికి లేఖ రాస్తామని..కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ అలాంటి ఆలోచనే చేయలేదు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు మాత్రం..జగన్‌కు మద్దతు ప్రకటిస్తూ… ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని చెబుతున్నారు..