ఏపీలో చంద్రబాబు ఓడిపోతారని.. జగన్ బ్రాహ్మండంగా గెలవబోతున్నారని కూడా.. ప్రకటించారు. నిజానికి గత ఎన్నికల ముందు కూడా జగన్ గురించి ఇలాంటి ప్రకటనలే చేశారు కేసీఆర్. ఏపీలో.. చంద్రబాబు అధికారంలో ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు. దానికి కారణాలు రాజకీయమా.. పాలనా పరమా.. అంటే.. దానికి అనేక రకాల విశ్లేషణలు వస్తాయి. కారణాలు ఏమైనా… ఏపీలో చంద్రబాబు.. మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోసం… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. చివరికి వైసీపీ ఫిర్యాదులతో.. టీడీపీ యాప్‌ను నిర్వహిస్తున్న సంస్థపై కూడా దాడి చేసి… క్లోజ్ చేయించారు. ఇక షర్మిల ఫిర్యాదులపై… ఇతర వైసీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు చూపిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఇక.. వైసీపీకి.. ఎన్నికల్లో పంచడానికి వెయ్యి కోట్లు పంపించారని… చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిపోయిన ప్రచారసామాగ్రిని కూడా.. వైసీపీకి పంపినట్లు కొన్ని సంఘటనతో బయటపడింది. ఇక.. డబ్బుల పంపిణీని కూడా.. కొన్ని చోట్ల.. తెలంగాణకు చెందిన వారు చేస్తున్నారని.. పోలీసులకు పట్టుబడిన ఘటనల్లో వెల్లడవుతోంది. ఇలాంటి సమయంలో.. కేసీఆర్ – జగన్ కుమ్మక్కయ్యారని… టీడీపీ నేతలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. ముసుగులు తీసేసి.. కలసి పోటీ చేయాలని… ధైర్యం ఉంటే.. బయటకు వచ్చి నేరుగా ఏపీకి వచ్చి ఎన్నికల ప్రచారం చేయాలని.. టీడీపీ నేతలు సవాల్ చేశారు. అయితే.. ఇంత కాలం.. సైలెంట్ గా ఉన్న కేసీఆర్… ఎన్నికల ప్రచార గడువుకి ఒక్క రోజు ముందుగా… బయటపడ్డారు. తాను..జగన్.. ఒక జట్టు అని బయటపడ్డారు.
నిజానికి కేసీఆర్ ఇలా ప్రకటించడానికి జాతీయ రాజకీయాలు కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రతి ప్రచారసభలోనూ.. తెలంగాణ ప్రజలు పదహారు సీట్లు ఇస్తే.. తాను 120 సీట్లు ఇప్పటికే పోగేశానని చెబుతూ వస్తున్నారు. ఆ నూట ఇరవై సీట్లు… తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, జేడీఎస్ లాంటి పార్టీలకు వచ్చేవని అర్థం. అయితే.. ఈ పార్టీల అధినేతలందరూ.. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వచ్చారు. చివరికి… జగన్ తో.. కలిసి పని చేస్తామని.. కేసీఆర్ చెబుతున్న సమయంలోనే… చంద్రబాబు ప్రధాని అవుతారంటూ… దేవేగౌడ కృష్ణాజిల్లాలో చెబుతున్నారు. దీంతో.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు ఎవరూ లేరని స్పష్టమయింది. ఇలాంటి సమయంలో.. తన ఫ్రంట్‌కు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. ఆయన చెప్పుకునే ప్రయత్నాన్ని చేయడంతో పాటు… ఏపీలో.. జగన్ కు వచ్చే సీట్లన్నీ.. టీఆర్ఎస్తో కలుస్తాయని చెప్పకనే చెప్పారని భావిస్తున్నారు.