ఆంధ్రోళ్లు మంచోళ్లనేంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ … వికారాబాద్ లో చేసిన వ్యాఖ్యలు … తెలంగాణతో పాటు.. ఏపీలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నిలబడిన ఆంధ్ర వ్యతిరేకతను.. ఇప్పుడు.. కేసీఆర్.. మరో విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడమే .. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఉద్యమ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు ఆంధ్రోళ్లకు ఇస్తున్న సర్టిఫికెట్లకు .. పొంతన ఉండటం లేదు. ఆంధ్రులతో పంచాయతీ లేదని..వారంతా మంచి వాళ్లే అన్నారు. ఈ మాట విని… ప్రసంగం వినేవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఉద్యమ సమయంలో.. ఆంధ్రవాలే భాగో… తెలంగాణవాలే జాగో.. అనే నినాదం ఇవ్వడమే కాదు… తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పండుగలకు ఊరెళ్లిన వారిని రానివ్వబోమని.. రైలు పట్టాల మీద కూర్చున్న చరిత్ర టీఆర్ఎస్కు ఉంది.
ఆంధ్ర కుక్కలు నుంచి.. ఆంధ్రాలో పుట్టిన వాళ్లంతా రాక్షసులే అనే పదాలు చాలా అసువుగా వాడారు. ఇప్పుడు… కేవలం చంద్రబాబుతో పాటు..మరో పది మంది మాత్రమే కిరికిరిగాళ్లని.. అందరూ.. మంచివాళ్లేనని ప్రకటించేస్తున్నారు. కేసీఆర్ ప్రకటనలు…. ఆయనలో రాజకీయ అవసరాలు తెచ్చిన మార్పులుగా… రాజకీయపార్టీలు చెబుతున్నాయి. చంద్రబాబు… వ్యక్తిగతహోదాలో కాదు.. ఏపీ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారు. ఆ విషయాన్ని బయటకు రాకుండా.. ఏపీ ప్రజలు మంచి వాళ్లని చెబుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది…. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ.. ఒకేరకంగా ఉన్న ఆయన విధానం.. ఇప్పుడు.. ఏపీలో మిత్రుడు జగన్ ను గెలిపించడానికి.. మార్చుకున్నారు..
కేసీఆర్ లో వచ్చిన మార్పు.. ఆయన రాజకీయ అస్థిత్వానికి ఓ పెద్ద మచ్చ తెచ్చి పెట్టినట్లయింది. ఇంత వరకూ.. ఆంధ్రులే.. అన్నీ దోచుకున్నారని చెప్పి… తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి.. కొన్ని వందల మంది బలిదానాలకు… కారణం అయిన కేసీఆర్.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత.. రాజకీయ అవసరాల కోసం… ఉద్యమ వీరుల్ని కూడా కించ పరుస్తున్నారు. వారి త్యాగాలకు ఏ మాత్రం గుర్తింపు లేకుండా ఆంధ్ర భజన చేస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలు.. తెలంగాణలో వినిపిస్తూండంగా.. అసలు.. కేసీఆర్ సర్టిఫికెట్లు.. మాకెందుకు అని.. ఆంధ్రలో.. అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్ర ప్రజల్నే బూచిా చూపి.. తొలి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టేలా చేసిన కేసీఆర్.. ఇప్పుడు.. అదే ఆంధ్రులకు మంచోళ్లని సర్టిఫికెట్ ఇస్తే… ఓ వింత జీవిగా చూస్తారు కానీ… మరో విధంగా చూడరని అంటున్నారు.