తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ… ఆరోగ్యం బాగాలోకేపోయినా… ప్రచారానికి వచ్చారు. ఒకే ఒక్ బహిరంగసభలో ప్రసంగించారు. ఆ సభలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. అంతే.. ఆ మరుక్షణం నుంచి టీఆర్ఎస్ నేతుల విరుచుకుపడ్డారు. తెలంగాణ గడ్డపై నుంచి ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించడం ఏమిటని మండిపడ్డారు. ఇప్పుడు అదే తెలంగాణ గడ్డపై నుంచి.. ఏపీకి ప్రత్యేకహోదా కు మద్దతిస్తామని ప్రకటించారు. ఓ రకంగా… ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయంటే.. అప్పట్లో దళిత బిడ్డలను ఉద్యమంలో… వాడేసుకోవడానికి.. దళితుడే సీఎం లేకపోతే మెడ నరుక్కుంటా.. అన్నంత ఆవేశం కనిపించింది. బహుశా.. ఏపీకి ప్రత్యేకహోదా తేలేకపోతే మెడనరుక్కుంటానంటానన్నంత ఆవేశం ఆయనలో కనిపించింది.
ఏపీ ప్రజలు అంత వెర్రోళ్లలా కనిపిస్తున్నారా…?
తెలంగాణ ఎన్నికల సమయంలో.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే… తమ పరిశ్రమలన్నీ తరలిపోతాయని… సెంటిమెంట్ పెరిగేలా చేసుుకన్న టీఆర్ఎస్… ఇప్పుడు… అదే ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించండం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరిచేదే. ఓ వైపు.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి… తాను, కేసీఆర్ కలిసి ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని… ప్రకటనలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం… ఏపీకి కేసీఆర్ అంత సుముఖంగా ఉంటే.. ప్రత్యేకహోదా ఇస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని… కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న కేసీఆర్… ప్రచార గడువు ముగిసే సమయంలో… ఏపీకి ప్రత్యేకహోదా మద్దతుగా ప్రకటన చేశారు. జగన్ బ్రహ్మాండంగా గెలుస్తాడని.. ఇద్దరం కలిసి… ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని తన చివరి ప్రచారసభలో చెప్పారు. నిజానికి ఐదేళ్ల కాలంలో.. ఏపీకి ప్రత్యేకహోదా అనే ప్రస్తావన వచ్చినప్పుడు.. తెలంగాణ వ్యతిరేకించింది. చివరికి.. ప్రత్యేకహోదా అంశంపై… కేంద్రంపై..టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా సమర్థించ లేదు. ఏపీకి ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
పోలవరంపై కేసులేంటి..? బయట చెబుతున్నదేంటి..?
ఈ ఎన్నికల ప్రచార వేడి ఉన్నప్పుడే.. పోలవరాన్ని తక్షణం నిలిపి వేయాలంటూ… సుప్రీంకోర్టులో.. తెలంగాణ పిటిషన్ దాఖలు చేసింది. అయినా కేసీఆర్ తాము పోలవరం ప్రాజెక్టుకు అడ్డం కాదని ప్రకటించారు. తమను ముంచవద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. అసలు ముంపు మండలాలు ఏపీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆ మండలాలు మళ్లీ తమకివ్వాలంటూ.. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. అదే సమయంలో.. ఒడిషాకు వెళ్లిన కేసీఆర్.. అక్కడ కూడా… పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించామని చెప్పారు. దీంతో.. పోలవరం ప్రాజెక్ట్ నిలిపి వేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. చేయాల్సినవన్నీ చేస్తూనే.. ఏపీలో ఓటింగ్‌కు మూడు రోజుల ముందు.. పోలవరానికి తాము అడ్డం కాదని ఓ ప్రకటన చేశారు. ఇది మరో విచిత్రం.
చంద్రబాబు గెలిస్తే కేసీఆర్ ముల్లేం పోతుంది..?
ఏపీలో..చంద్రబాబు అధికారంలో ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారు .ఏమైనా… ఏపీలో చంద్రబాబు .. మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోసం… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. చివరికి వైసీపీ ఫిర్యాదులతో.. టీడీపీ యాప్‌ను నిర్వహిస్తున్న సంస్థపై కూడా దాడి చేసి… క్లోజ్ చేయించారు. ఇక షర్మిల ఫిర్యాదులపై… ఇతర వైసీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు చూపిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ఇక.. వైసీపీకి.. ఎన్నికల్లో పంచడానికి వెయ్యి కోట్లు పంపించారని… చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. అదే సమయంలో… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిపోయిన ప్రచారసామాగ్రిని కూడా.. వైసీపీకి పంపినట్లు కొన్ని సంఘటనతో బయటపడింది. ఇక.. డబ్బుల పంపిణీని కూడా.. కొన్ని చోట్ల.. తెలంగాణకు చెందిన వారు చేస్తున్నారని.. పోలీసులకు పట్టుబడిన ఘటనల్లో వెల్లడవుతోంది.
కేసీఆర్ తన వెనుక ఉన్నారని చెప్పిన వారంతా… చంద్రబాబుకు జైకొట్టిన కోపమా..?
కేసీఆర్ ఇలా ప్రకటించడానికి జాతీయ రాజకీయాలు కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ప్రతి ప్రచారసభలోనూ.. తెలంగాణ ప్రజలు పదహారు సీట్లు ఇస్తే.. తాను 120 సీట్లు ఇప్పటికే పోగేశానని చెబుతూ వస్తున్నారు. ఆ నూట ఇరవై సీట్లు… తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, జేడీఎస్ లాంటి పార్టీలకు వచ్చేవని అర్థం. అయితే.. ఈ పార్టీల అధినేతలందరూ.. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వచ్చారు. చివరికి… జగన్ తో.. కలిసి పని చేస్తామని.. కేసీఆర్ చెబుతున్న సమయంలోనే… చంద్రబాబు ప్రధాని అవుతారంటూ… దేవేగౌడ కృష్ణాజిల్లాలో చెబుతున్నారు. దీంతో.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు ఎవరూ లేరని స్పష్టమయింది. ఇలాంటి సమయంలో.. తన ఫ్రంట్‌కు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. ఆయన చెప్పుకునే ప్రయత్నాన్ని చేయడంతో పాటు… ఏపీలో.. జగన్ కు వచ్చే సీట్లన్నీ.. టీఆర్ఎస్తో కలుస్తాయని చెప్పకనే చెప్పారు. మొత్తానికి.. కుట్రల కోణంలో కేసీఆర్ కొత్త తరహా రాజకీయానికి వచ్చారు.