జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వైఎస్ఆర్సిపి అధినేత జగన్ ఎప్పటికే సీఎం కాలేడు” అని ఈరోజు వ్యాఖ్యానించాడు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అవుతాడు అంటూ కెసిఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రోజు మాట్లాడుతూ, జగన్ సిఎం అవుతాడని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించాడు.
2014 ఎన్నికలప్పుడు కూడా జగన్ సీఎం అవుతాడని కెసిఆర్ అన్నాడు అని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, మరి అప్పుడు జగన్ సీఎం అయ్యాడా అని ప్రశ్నించాడు. తిరుమలకు జగన్ చెప్పులు వేసుకుని వెళ్లాడని, ఒకవేళ యాదాద్రికి అలాగే చెప్పులు వేసుకొని వెళితే అప్పుడు కూడా కేసీఆర్ జగన్ ని సమర్థిస్తాడా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, జగన్ సీఎం కావడం అసాధ్యమని వ్యాఖ్యానించాడు. రాబోయేది జనసేన ప్రభుత్వం అని, జనసేన లేకుండా 2019లో ప్రభుత్వాలు ఏర్పాటు కావని పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు.
Click here: KCR’s bad track record in survey reports
నిజానికి తన పార్టీకి సంబంధించిన ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే, మిగతా ఫలితాలను అంచనా వేయడంలో కెసిఆర్ ఎప్పుడూ సఫలీకృతం కాలేదు. 2009లో ఎన్నికల అయిన మర్నాడే ఎన్డియే గెలవబోతోంది అంటూ జోస్యం చెప్పి, తాను ఉన్న తృతీయ కూటమిని వదిలేసి, కెసిఆర్ బిజెపి వైపు వెళ్ళిపోయాడు. కానీ ఆయన అంచనా తలకిందులై యూపీఏ అధికారంలోకి వచ్చింది. అలాగే 2014 ఎన్నికల అయిన తర్వాత కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలవ బోతున్నారు అంటూ వ్యాఖ్యానించాడు కాని అక్కడ కూడా ఫలితం తారుమారు అయింది.రెండేళ్ల కిందట నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చాలా బలహీనంగా ఉన్నాడంటూ వ్యాఖ్యలు చేశాడు. కట్ చేస్తే 30 వేల మెజార్టీతో ఆ బలహీనమైన అభ్యర్థి విజయం సాధించాడు.
ఇదిలా ఉంటే, మరొక పక్క, గత 15 రోజుల్లో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని అంతర్గతంగా వస్తున్న విశ్లేషణను బట్టి జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే జగన్ సీఎం కాకుండా ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఆపగలుగుతాడా అన్నది మే 23న తెలుస్తుంది