ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల విషయంలో… సుప్రీంకోర్టు.. ఓ కీలకమైన తీర్పును ఇచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున… వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాలను ఇస్తూ… ఈసీ ఇచ్చిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంటే.. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో.. ఈసీ చేసిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదన్నమాట. అసలు సుప్రీంకోర్టు గతంలో .. అన్ని చోట్ల వీవీ ప్యాట్లను పెట్టాలని ఆదేశించింది. ఆ పని ఈసీ అంత వేగంగా చేయలేకపోయింది. ఇప్పుడు లెక్కింపు సంఖ్య ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో విశ్వాసం పెరగడానికి ఎంతో అవసరమని విపక్షాలు చెబుతున్నా.. ఈసీ మాత్రం వ్యతిరేకంగానే ఉంది.
ఎన్నికలపై విశ్వాసం పెంచడానికి ఈసీ ప్రయత్నించడం లేదా..?
ఈవీఎంలకు .. వీవీ ప్యాట్లు అనుసంధానిచ్చినప్పుడు… ఓటరు .. తాను వేసిన ఓటు…తను అనుకున్న అభ్యర్థికే పడినట్లుగా వచ్చే స్లిప్.. వీవీ ప్యాట్‌లో ఉంటుంది. అది ఆరు సెకన్ల పాటు.. ఓటరుకు కనిపిస్తుంది. అయితే.. ఆ స్లిప్పులు చూడటానికే కానీ లెక్కింపునకు కాదు. ఇప్పటి వరకూ.. ఉన్న నిబంధనల ప్రకారం.. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి.. చొప్ప.. ర్యాండమ్‌గా.. ఈవీఎంను తీసుకుని.. ఆయా బూత్‌లోని… వీవీ ప్యాట్‌ను మాత్రమే లెక్కిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అనేక అంశాలపై అనుమానాలొస్తున్నాయి. ఓటర్ల జాబితా నుంచి ప్రతీ ఒక్క దానిపై.. అనుమానాలొచ్చేలా పరిస్థితులు మారిపోయాయి. ఈవీఎంలపై అనుమానాలొస్తున్నాయి కనుక… సగానికి సగం.. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ప్రజాస్వామ్యంలో తన ఓటు.. తాను అనుకున్న వారికే పడిందని.. ఓటకు విశ్వాసం ఉండాలి. అనుమానం ఉండకూడదు. ప్రజాస్వామ్యానికి ఇదే కీలకం. ఆ అనుమానాలు తీర్చడానికే వీవీప్యాట్ మిషన్లు పెట్టారు. అలా మిషన్లు పెట్టుకుని.. ఆ స్లిప్లులు లెక్క పెట్టకపోతే ఏం లాభం..?
ఈసీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందా…?
ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కలిగించడానికి వీవీ ప్యాట్ మిషన్లు స్లిప్పులు యాభై శాతం… లెక్కించాలని… విపక్షాలు కోర్టుకెళ్లాయి. కానీ ఈసీ మాత్రం.. అసలు ఈవీఎం మిషన్లలో ఒక్క లోపం కూడా లేదు. ఇప్పుడున్న విధానాన్ని మార్చాల్సిన పని లేదని వాదించించింది. దీన్ని సుప్రీంకోర్టు అంగీకరంచలేదు. అలా లెక్కిస్తే చాలా సమయం పడుతుందని వాదించింది. దీన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అలాగే… విపక్ష పార్టీలు అడిగినట్లుగా…యాభై శాతం ఓటింగ్ స్లిప్పుల్ని లెక్కించడానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కానీ.. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉన్న… సంఖ్యను మాత్రం సుప్రీంకోర్టు ఐదుకు పెంచింది. నా సూచన ఏమిటంటే… ఓ నియోజకవర్గంలో.. ఎంత మెజార్టీ ఉంటే… అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తే బాగుంటుంది. వెయ్యి ఓట్లలోపు తేడా ఉంటే… ఎక్కువ వీవీ ప్యాట్లు… లెక్కించాలి. మెజార్టీ ఎక్కువైన కొద్దీ…వీవీ ప్యాట్ల లెక్కింపును కూడా తగ్గిస్తే సరిపోతుంది.
నమ్మకం పెంచడానికి కొంత సమయం కేటాయిస్తే ఏమవుతుంది..?
ఉదాహరణకు ఓ నియోజకవర్గంలో.. ఇరవై ఓట్ల తేడాతో ఫలితం వచ్చిందనుకుందాం. అక్కడ కూడా.. ఒక్క వీవీ ప్యాట్‌ను లెక్కిస్తే నమ్మకం కదరదు. ఎక్కువ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి.. నమ్మకం కలిగించాలి. ఇరవై వేల తేడా ఉన్న దగ్గర… వీవీ ప్యాట్ మెషిన్లు లెక్కపెట్టినా సరిపోతుంది. గెలిచిన, ఓడిన వారికి మధ్య ఉన్న మార్జిన్‌ను… బట్టి.. వీవీ ప్యాట్ స్లిప్లుపు లెక్కించాలి. దీని వల్ల.. విశ్వాసాన్ని పెంచండానికి ఉపయోగపడుతుంది. లెక్కింపు వల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. ఎక్కువ సమయం.. ఎక్కువ సిబ్బంది కావాలంటారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలగడానికి .. ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు నమ్మకం కలగడానికి… ఈ మాత్రం చేయలేరా..? కొంత మొత్తం ఖర్చు పెరిగినా.. ఎన్నికల కోసం ఖర్చు పెట్టలేనంత దీన స్థితికి.. భారత్ చేరలేదు కదా..! వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో ఈసీ తీరును.. సుప్రీంకోర్టు… తిరస్కరించినట్లేనని భావివంచవచ్చు.