మలుపు సినిమాతో మంచి అప్లాజ్ వచ్చింది డైరక్టర్ సత్య పినిశెట్టికి. కానీ తరువాత సినిమా పడలేదు. నాగ్ చైతన్య, అఖిల్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఏవీ మెటీరియలైజ్ కాలేదు. లేటెస్ట్ గా నాచురల్ స్టార్ నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాని రెండు మూడు కమిట్ మెంట్ లతో వున్నాడు. విక్రమ్ కుమార్, ఇంద్రగంటి సినిమాలు ఫినిష్ చేయాలి. ఈ రెండింటి తరువాత మళ్లీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనే మరో సినిమా చేసే ఆలోచనలో నాని వున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు కోసం సత్య పినిశెట్టి లైన్ ఒకటి నాని ఓకె చేసినట్లు తెలుస్తోంది.
వైవిధ్యమైన సినిమాల కోసం చూసే నాని ఈ సారి సత్య తో కలిసి ఓ థ్రిల్లర్ టచ్ వున్న సబ్జెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే సత్య పినిశెట్టి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినిపిస్తోంది.