ఆంధ్రప్రదేశ్లో రాజకీయం భలే చిత్రంగా ఉంటుంది. బీజేపీ నేతలు అంత కంటే చిత్రంగా ఉంటారు. జాతీయ పార్టీ… కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ఏపీలో గెలిచి పడేస్తామని…. చాలెంజ్ లు చేసే బీజేపీ నేతలు…. తీరా ఓటింగ్ ముగిసిన తర్వాత…. సంబరాలు చేసుకుని.. వైసీపీనే గెలుస్తుందంటున్నారు. అదేంటి… 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి… కోట్లు ఖర్చు పెట్టి.. బహిరంగసభలు ఏర్పాటు… చేసి మోడీ, అమిత్ షా సహా.. స్టార్ క్యాంపెయినర్లందర్నీ తీసుకొచ్చి… ప్రచారం చేయించి.. తీరా వైసీపీ అధికారంలోకి వస్తుందని.. చెప్పేస్తున్నారు. అంటే వారు… తీసుకొచ్చింది.. వైసీపీకి ప్రచారం చేయడానికా…?
పోలింగ్ సరళిపై మాట్లాడిన జీవీఎల్ నరసింహారావు… ఏ మాత్రం సిగ్గుపడకుండా…. తాను బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిననే సంగతిని కూడా మార్చిపోయి…. ఎపీలో… వైసీపీ గెలుస్తుందని ప్రకటించేశారు. ఈసీ పూర్తి స్థాయిలో వైసీపీకి సహకరించేలా చేసి.. ఐటీ అధికారులను కూడా.. ఎప్పుడెప్పుడు ఎవరిపై దాడులు చేయాలో.. సోదాలు చేయాలో కూడా… బీజేపీ నేతలు డిక్టేట్ చేశారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు.. జీవీఎల్ నరసింహారావు.. ఏ మాత్రం తడుముకోకుండా… ప్రకటనలు చేస్తున్నారు.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో… బీజేపీ హార్డ్ కోర్ ఓటర్లు ఎవరైనా ఉంటే… వారు… వైసీపీకే ఓటు వేయాలన్న ప్రచారం అంతర్గతంగా చేశారు. దాన్నే జీవీఎల్ బయటకు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు… బీజేపీ ఖాతాలోనే పడతాయనేది.. ఆ పార్టీ నేతల అంచనా. అందుకే అంతర్గతంగా వైసీపీకి ఆ పార్టీ ఓటర్లు వేశారు. ఈ ఫలితంగా బీజేపీకి.. ఒక్క చోట డిపాజిట్ కాదు కదా.. కనీసం పరువు నిలుపుకోగలిగినన్ని ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో నియోజకర్గంలో మూడు అంకెల ఓట్లు కూడా.. బీజేపీ అభ్యర్థులకు వచ్చే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత జీవీఎల్ .. ఇదే విషయాన్ని చెప్పి.. మేము మద్దతివ్వడంలో వైసీపీకి ఆ మాత్రం ఫలితాలు వచ్చాయని అంటారేమో..?