ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయారని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి సీట్లు, ఓట్లు రావని ముందు నుంచీ అందరూ చెబుతున్న విషయమే. అయితే.. ఈ విషయంలో జీవీఎల్ నరసింహారావు కొత్తగా చెబుతున్నారు. ప్రజలు ప్రాంతీయ పార్టీలకు అమ్ముడుపోయారని చెబుతున్నారు. కానీ… ఓట్లు కొనే విషయంలో.. పార్టీలకు తేడాలు లేవు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పార్టీలు అనే తేడా లేకుండా.. అందరూ… డబ్బులు పంచుతున్నారు. ఇలాంటి ఆరోపణలు జీవీఎల్ నరసింహారావు చేసే ముందు… మొన్న సికింద్రాబాద్ లో పట్టుబడిన రూ. ఎనిమిది కోట్లు ఎక్కడకు వెళ్తున్నాయో చెప్పాలి.
డబ్బులు పంచింది పార్టీలు అయితే.. ప్రజల్ని నిందిస్తారా..?
ఆంధ్రప్రదేశ్లో డబ్బుల పంపిణీ జరిగిందనేది నిజం. ఒక్కో చోట రెండు నుంచి ఐదు వేల వరకూ పంపిణీ చేశారు. అర్థరాత్రి సమయంలో తలుపు తట్టి మరీ ఇచ్చారు. కొంత మందికి గూగుల్ పే ద్వారా.. పేటీఎం ద్వారా కూడా పంపిణీ చేశారు. జీవీఎల్ ప్రచారం సమయంలో పంపిణీ చేశారని చెబుతున్నరు కానీ… ప్రచార సమయంలో ఎవరూ పంచరు. పోలింగ్ ముందు రోజు… పంచుతారు. పంచారన్నది నిజం. జనం డబ్బులు తీసుకుంటున్నారన్నది నిజం. అయితే.. అమ్ముడుపోయారని.. ప్రజలపై నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఆ పరిస్థితికి రాజకీయ పార్టీలే తెచ్చాయి. రాజకీయ వ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తున్నప్పుడు అలానే చేస్తారు. ప్రజలు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నా.. ఒక్క పార్టీకే ఓటు వేస్తారు కదా..!. అంటే మోసం చేసినట్లా..?. రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఓటర్లు తీసుకుంటున్నారు. వారు వేయాలనుకున్న పార్టీకి ఓటు వేస్తున్నారు.
బ్లాక్ మనీని అరికట్టలేదని జీవీఎల్ అంగీకరించినట్లేగా..?
జీవీల్ నరసింహారావు.. వేల కోట్ల బ్లాక్ మనీ పంచుతున్నారని చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు తర్వాత.. అసలు బ్లాక్ మనీ లేదని.. మొత్తం… బయటకు తీశామని.. అసలు దేశంలో బ్లాక్ మనీ లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వేల కోట్ల బ్లాక్ మనీ పంచారని చెబుతున్నారు. నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ లేదని… జీవీఎల్ అనేక సార్లు వాదించారు. ఇప్పుడు… ఆయనే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే వేల కోట్ల ధనం పంచారని చెబుతున్నారు. అంటే.. పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ మిగిలి ఉన్నట్లే కదా..! మన దేశంలో ఉన్నదే పదిహేను.. పదహారు లక్షల నగదు. అందులోనే.. కొన్ని వేల కోట్ల బ్లాక్ మనీ.. ఏపీలో సర్క్యూలేట్ అవుతోంది. మొత్తం భారతదేశం మొత్తం ఐదారు లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది కదా. అంటే.. నోట్ల రద్దు ఫెయిలనట్లే కదా. నోట్ల రద్దు… అనేది.. బ్లాక్ మనీని వైట్ చేయడానికే. రూ. రెండు వేల నోటు తేవడానికి అదే కారణం. చంద్రబాబు కూడా.. ఓట్ల కొనుగోల కోసమే… రూ. రెండు వేల నోటు తెచ్చారని చెబుతున్నారు. అదే జరుగుతోంది. ఎక్కడా.. రూ. రెండు వేల నోటు కనిపించడం లేదు. ఆ నోటు.. బ్లాక్ మనీగా మారిపోయింది కదా..! నీతి నిజాయితీ ఉంటే.. ఎన్నికలకు ఏడాది ముందే రూ. రెండు వేల నోటును రద్దు చేసేవారు కదా..! నల్లధనం.. పెద్దమొత్తంలో ఏపీలో సర్క్యూలేట్ అయిందంటే.. అది కేంద్ర ప్రభుత్వ చేతకానితనమే కదా..!.-
తప్పంతా రాజకీయ పార్టీలదే..! ప్రజలనెందుకు అవమానిస్తారు..?
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు.. డబ్బులు పంచాయని జీవీఎల్ ఆరోపించారు. మరి అదే్ నల్లధనం పెంచి… సీట్లు తెచ్చుకునే… వైసీపీతో.. పొత్తు పెట్టుకోబోమని.. బీజేపీ నేతలు చెప్పగలరా..?. ఏపీలో రెండు ప్రధాన పార్టీలు డబ్బులు పంచాయని జీవీఎల్ చెబుతున్నప్పుడు.. రెండు పార్టీలను దూరం పెట్టాలి. కానీ వైసీపీతో ఎందుకు అంటకాగుతారు. నల్లధనం పంచారని తెలిసి కూడా… పొత్తులు పెట్టుకుంటున్నారు.. అంటే.. ప్రజలను మోసం చేస్తున్నట్లేకదా..! అంటే.. ఓ రకంగా.. రాజకీయ పార్టీలు కూడా అమ్ముడుపోవడమే. పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజలను అమ్ముడుపోయారని నిందించడం ఎందుకు..?. మీరు కార్పొరేట్ల దగ్గర వేల కోట్ల విరాళాలు తీసుకుంటారు. కానీ వివరాలు చెప్పరు. అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు. పార్టీల నేతలు కూడా… కలసిపోయారు. ఏ పార్టీలో ఉండే నేత.. ఏ పార్టీలో ఉంటారో తెలియదు. జీవీఎల్ కలల్లో ఉన్నారు. టీడీపీకి ప్రత్యామ్నాయం అవుతున్నారని.. అంటున్నారు.