ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయింది. దాదాపుగా సగం పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నానికి పోలింగ్ ప్రారంభం.. .సాంకేతిక సమస్యలు.. గందరోళం మధ్య… పోలింగ్ జరిగింది. ఓటర్ల పట్టుదలతో… పోలింగ్ శాతం.. అంచనాలకు అందని విధంగా ఉంది. ఇది… తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకుని తీరాల్సిందేనన్న కసితో… ప్రజలు ఓట్లేశారు. అంత వరకూ.. ఓకే. ఇప్పుడు.. ఎవరు ఏం చేసినా…. ఈవీఎంలలో నిక్షిప్తం అయినా తీర్పు మారదు. చంద్రబాబు ఎన్ని పోరాటాలు చేసినా… ఈసీ చలించదు. కానీ చంద్రబాబు.. ఈవీఎంలపై అదే పనిగా అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని…. వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. పోలింగ్ సరళి చూస్తే.. టీడీపీకి అనుకూలంగా ఉందని.. పార్టీలకు అతీతంగా … విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ… వైసీపీలో మాత్రం.. చంద్రబాబు తీరే ధైర్యాన్ని నింపుతోంది.
చంద్రబాబు.. అంతగా… ఈవీఎంలపై భయంతో ఉన్నారంటే.. ఆయన ఓడిపోతున్నారని.. నమ్ముతున్నారు. అందుకే… రెండు, మూడు రోజులుగా.. వైసీపీ నేతలు.. గెలవబోయేది తామేనని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాం చేసుకోవడం వల్ల వైసీపీకి మనోధైర్యం వస్తుంది కానీ.. కొత్తగా.. ప్రజాతీర్పు మారే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు.. ఏపీలో ఏ ప్రచారం జరిగినా.. తీర్పు నిక్షిప్తమయింది కాబట్టి… బిందాస్ గా…. ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరును జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. అదే తరహాలో.. దేశం మొత్తం చేసి.. ప్రజాతీర్పును…మోడీ కాలరాయబోతున్నారని చెబుతున్నారు. అంటే.. ఇప్పుడు చంద్రబాబుకు.. ఏపీలో ఎలాంటి ప్రచారం జరిగినా నష్టం లేదు. కానీ.. అదే ప్రచారం.. జాతీయ స్థాయిలో జరిగితే మోడీకి నష్టం.
తనకు ఎలాంటి లాభనష్టాలు లేనప్పుడు… మోడీకి కచ్చితంగా నష్టం జరుగుతుందనుకున్నప్పుడు.. చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తారు.. ?. ఇప్పుడు అదే చేస్తున్నారు… మే 23న కౌంటింగ్ జరుగుతుంది. అప్పటి వరకూ.. ప్రజలు ఏం మాట్లాడుకున్నా… అంతా… గాసిప్సే. తీర్పు మారే అవకాశం కూడా లేదు. అందుకే.. చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలో ఢిల్లీపై దండెత్తారు. కానీ.. ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం. .. అవసరం లేని ఆనందం తెచ్చుకుని సంతోష పడుతున్నారు.