ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల విషయంలో… చంద్రబాబు… చేస్తున్న విమర్శలను… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు పట్టారు. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు.. ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అందుకే… జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకుండా ఉండటాన్ని హుందాతనంగా తీర్పిచ్చారు. దానికి వయసుతో సంబంధం ఏముందో కానీ… 45 ఏళ్ల జగన్ హుందాగా ఉంటే… చంద్రబాబు ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు.. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరును కూడా ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఓటింగ్ శాతం వెంటనే చెప్పలేకపోవడం… వంటి కారణాలను విశ్లేషిస్తున్నారు. దీనికి కొత్తగా ఇప్పుడు… భారతీయ జనతా పార్టీ నేతలు కూడా…. ఈవీఎంల రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఓటింగ్ రోజు చివరి గంటలో.. అసలు ఓటర్లే… పోలింగ్ బూత్ల దగ్గర లేకపోతే… ఆరు శాతం ఎక్కువ ఓట్లు నమోదయినట్లు ఈసీ ప్రకటించడంతో… బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగానే… రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
అదే సమయంలో.. ఏకంగా స్ట్రాంగ్ రూమ్లో.. నిలబడి ఫోటో దిగిన టీఆర్ఎస్ నేత వ్యవహారం హైలెట్ అవుతోంది. ఇలా… తెలంగాణలో.. ఎన్నికల నిర్వహణ విషయంలో.. అనేక విమర్శలు వస్తున్నప్పటికీ.. అన్నీ తమకు అనుకూలంగా ఉండంతో.. కేటీఆర్ కూడా… ఈసీ పని తీరును మెచ్చుకుంటున్నారు. అసలు తెలంగాణలో పాతిక లక్షల ఓట్లను తొలగించేసి.. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన విధానమే… దేశవ్యాప్త చర్చకు కారణం అవుతోంది. చంద్రబాబు ఈసీ పని తీరు విషయంలో.. ఇదే విషయాన్ని జాతీయ మీడియా ముందు చర్చకు పెడుతున్నారు. పాతిక లక్షల ఓట్లను తొలగించేసి.. ఎన్నికలు నిర్వహించిన తర్వాత … సారీ చెప్పిన తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి తీరు … ఇప్పుడిప్పుడే.. హైలెట్ అవుతోంది. దీనిపై మరింత చర్చ జరిగితే.. మొదటగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పైనే… చర్చ జరుగుతోంది. అందుకే కేటీఆర్… ఈవీఎంలపై చంద్రబాబు పోరాటాన్ని తప్పు పడుతున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలున్నాయి.
నిజానికి ఒక్క… చంద్రబాబు మాత్రమే.. ఈవీఎంల పనితీరుపై.. ఆరోపణలు చేయడం లేదు. ఈసీ తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలతో… సాంకేతిక ఆధారాలతో సహా… చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలు… పోరాటం చేస్తున్నాయి. న్యాయపోరాటం కూడా.. కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. బీజేపీ.. దాని అనుబంధ పార్టీలు మాత్రమే ఈవీఎంలను సమర్థిస్తున్నాయి. వాటిని వ్యతిరేకించేవారిపై విమర్శలు చేస్తున్నాయి. కొసమెరుపేమిటంటే… తనదాకా వస్తే మాత్రం.. కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్లో బీజేపీ నేతలు తరలిస్తూ పట్టుబడి రూ.8 కోట్ల విషయంలో ఆ పార్టీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో… ఈసీ పనితీరులో మాత్రం మార్పులు అవసరమని చెప్పుకొచ్చారు. అంటే.. తనకు ఇబ్బందికరం అయితే మాత్రం.. ఈసీని నిందించడానికి సిద్ధపడతారన్నమాట. అదే రాజకీయం.