తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై విమర్శలు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్… ఎలాంటి పరిమితులు పెట్టుకోవడం లేదు. తాను ఆ పార్టీలో పుట్టి పెరిగిన విషయాన్ని లేశ మాత్రం గుర్తుంచుకోవడం లేదు. అదే సమయంలో.. టీడీపీలో తన దగ్గర బంధువులు.. కీలక పాత్ర పోషిస్తూండటాన్ని కూడా.. ఆయన ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అసలు తమకు ఆ బంధుత్వాలు.. టీడీపీ వల్లే ఏర్పడ్డాయన్న విషయాన్నీ లైట్ తీసుకుంటున్నారు. అదే బంధుత్వాల వల్ల.. ఆయనకు… ఎన్నికలకు ముందు విజయవాజ గుడిలో..వీఐపీ ఆతిధ్యం లభిస్తే.. దాన్ని రాజకీయంగా.. విమర్శల కోసం వాడుకున్నారు. అప్పుడే ఆయన తన వియ్యంకుడు అయిన.. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ను ఇరించేశారు. తన రాజకీయం కోసం…. వియ్యంకుడ్ని విమర్శలు పాలు చేయడంతో… తలసాని మరోసారి ఏపీకి వచ్చినప్పుడు పట్టించుకున్న వారు లేరు.
పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా… తలసాని.. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేయడంతో.. ఇప్పటి వరకూ.. నోరెత్తని ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్.. ఒక్క సారిగా బ్లాస్ట్ అయ్యారు. రాజును మించిన రాజభక్తి …. చూపిస్తున్నారని… మండిపడ్డారు. జగన్ కోసం టీఆర్ఎస్ నేతలు పోటీపడీ మరి పని చేస్తున్నారని …మండిపడ్డారు. వైఎస్ కుటుంబం బీసీలకు చేసిన అన్యాయంపై తలసాని శ్రీనివాస్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. బీసీల వంచనకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని వ్యాఖ్యానించారు. అలాంటి వారి కోసం టీఆర్ఎస్ నేతలతో పాటు తలసాని పని చేయడం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా.. కేసీఆర్ వద్ద మార్కుల కోసం జగన్ను తలసాని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా? పదేపదే ఏపీ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నారని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని… పుట్టా నేరుగానే కౌంటర్ ఇచ్చారు.
టీఆర్ఎస్ నేతల్లో.. ఒక్క తలసాని మాత్రమే… టీడీపీపై దూకుడుగా ఉంటున్నారు. అనుచితమైన విమర్శలు చేస్తున్నారు. తలసాని అలా మాట్లాడుతున్నా.. ఆయన బంధువులైన పుట్టా సుధాకర్ యాదవ్, యనమల రామకృష్ణుడు మాట్లాడకపోవడం … టీడీపీలోనే అనేక విమర్శలకు కారణం అయింది. తలసాని పార్టీని దెబ్బతీస్తున్నా.. అదే పార్టీలో ఉండి.. వీరిద్దరూ… బంధుత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే.. ఎన్నికలు ముగిసిన తర్వాత… ఒక్కసారిగా పుట్టా.. బ్లాస్ట్ అవడం… టీడీపీలోనే ఆశ్చర్యకర పరిణామంగా మారింది.