సోషల్ మీడియా వైఖరి పట్ల సునీల్ బాగా హర్టయినట్టు కనిపిస్తున్నాడు. ఇటీవల సునీల్ చనిపోయాడంటూ ఓ వెబ్ సైట్‌లో వార్తొచ్చింది. అది నిజమా? కాదా? అనేది కూడా ఎవ్వరూ ఆలోచించకుండా దాన్ని వైరల్ చేశాడు జనాలు. దీనిపై సునీల్ బాగా హర్టయ్యాడు. ”వ్యూస్ కోసం ఓ వ్యక్తిని బలవంతంగా చంపేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అంటూ నిలదీస్తున్నాడు. ”ఈ విషయంపై చాలా బాధ పడ్డాను. ఆ వ్యక్తిపై కేసు వేద్దామని కూడా అనుకున్నాను. కానీ.. `భయ్యా. సారీ.. నేను నీ ఫ్యాన్‌ని. ఇది అనుకోకుండా జరిగిపోయింది` అని ప్రాధేయపడడంతో కేసు వేసే ఆలోచన నుంచి విరమించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.
సోషల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువగా వ్యాపిస్తోందని, ఆరోగ్యకమైన విషయాలేవీ సోషల్ మీడియాలో లేవని చెబుతున్నాడు సునీల్. ”నేనో కారో సైకిలో కొనుక్కున్నాననుకోండి. అది కూడా వార్తయిపోతుంది. ఓ వ్యక్తి తన జీవితంలో ఎదుగుతున్న క్రమంలో ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. దాన్ని వార్త అనుకుంటే ఎలా..? దాని బదులుగా వేరే విషయాలు ఆలోచించొచ్చు కదా? మీ స్పేస్‌ని ఎందుకు పాడు చేస్తారు?” అని నిలదీస్తున్నాడు సునీల్. పాయింటే కదా..??