ఎట్టకేలకు టీమ్ ఇండియా తన ప్రపంచకప్ జట్టుని ప్రకటించేసింది. 15మంది సభ్యులు గల బృందాన్ని కొద్దిసేపటి క్రితం ఖరారు చేసింది. రెండో వికెట్ కీపర్ గా పంత్ – దినేశ్ కార్తీక్‌ల మధ్య పోటీ నెలకున్న నేపథ్యంలో సెలక్టర్లు కార్తిక్ వైపే మొగ్గు చూపించారు. ప్రపంచకప్ బెర్తుకోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయుడుకి ఛాన్స్ దక్కలేదు. ఈ రెండు మార్పులు మినహా…. పెద్దగా అద్భుతాలేం జరగలేదు. టీమ్ ఇండియాకు రెగ్యులర్ గా చూస్తున్న ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కింది. ధావన్, విజయ్ శంకర్ తమ చోటు దనిలబెట్టుకున్నారు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న కే.ఎల్.రాహుల్‌కు బెర్తు దక్కింది.
మన జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ(కెప్టెన్). ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, చాహల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్‌యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ