గతవారం విడుదలైన ‘మజిలీ’ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకుంది. అటు పాజిటీవ్రివ్యూలు, ఇటు కలక్షన్లూ దక్కాయి. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మజిలీ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కథకు గిరాకీ మరింత పెరిగింది. తమిళ, కన్నడ చిత్రాల నుంచి రీమేక్ రైట్స్ కోసం ఆఫర్లు వస్తున్నాయి. కన్నడ రీమేక్ దాదాపు కన్ఫామ్ అయిపోయినట్టే. తమిళంలో ఈ సినిమాని ధనుష్ తో చేస్తే బాగుంటుందని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారు. ఈసినిమాని ధనుష్‌కి చూపించి, తనకు నచ్చితే, వెంటనే రీమేక్‌కి రంగం సిద్దం చేసుకోవాలని అనుకుంటున్నారు. మజిలీని తమిళంలో విడుదల చేశారు. కాకపోతే తెలుగు వెర్షన్ వెళ్లింది. దానికి మంచి వసూళ్లే దక్కాయి. తమిళంలో డబ్ చేసి విడుదల చేద్దామని నిర్మాతలు భావిస్తున్న తరుణంలో రీమేక్ ఛాన్స్ వచ్చింది. ఆ రూపంలోనూ నిర్మాతలకు మంచి రేటే గిట్టుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళంలో ఈ సినిమా చేస్తే… గీస్తే ధనుష్ మాత్రమే చేయగలడు. ధనుష్ బాడీ లాంగ్వేజ్‌కి ఇలాంటి పాత్రలు బాగా సూటవుతాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.