సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణ రాజకీయ దుమారానికి కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో కోడెల శివప్రసాద్ రావు…ఇనిమెట్ల గ్రామంలో బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించారని.. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో.. ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఇనుమెట్ల గ్రామంలో… పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లిన కోడెలపై…వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దాంతో ఆయన చొక్కా చినిగిపోయింది. కళ్లద్దాలు పగిలిపోయాయి. భద్రతా బలగాలు లేకపోవడంతో… ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. పోలింగ్ బూత్‌లో కోడెల ను ఉంచి… తలుపులు వేశారు. ఆ తలుపులు కూడా బద్దలు కొట్టి కోడెలపై దాడి చేశారు. ఇవన్నీ వీడియోలో రికార్డవడంతో.. పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇనిమెట్లతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల వైసీపీ కార్యకర్తలు కూడా కొందరు వీడియోలో ఉండటంతో ప్రణాళికాబద్ధంగా దాడికి ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలు సేకరించి… కేసులు నమోదు చేశారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ప్రొత్సాహంతోనే దాడి జరిగిందన్న ఫిర్యాదు రావడంతో.. ఆయనపైనా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా… అటు ఈసీకి.. ఇటు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కోడెలపై ఎవరూ దాడి చేయలేదని.. ఆయనే చొక్కా చించుకున్నారని ఆరోపించారు. బూత్ క్యాప్చరింగ్ చేశారని… ఆరోపించారు. ఈ ఆరోపణల పరంపర ఇలా సాగుతూండగానే… కోడెలపై కూడా.. సత్తెనపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు.
పోలింగ్ రోజు పలు చోట్ల.. హింసాత్మక ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. ఆ గొడవలు.. ఇంకా కొనసాగుతున్నాయి. నెల్లూరు సహా.. పలు చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ రెండూ… పరస్పర ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ కోణంలో స్పీకర్ పైనే దాడి జరగడం…తో విషయం సీరియస్ అవుతోంది. వైసీపీ చేసిందని.. టీడీపీ.. అసలు దాడి జరగలేదని వైసీపీ చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.