బీసీసీఐ ప్రకటించిన ప్రపంచకప్ జాబితాలో తెలుగుతేజం రాయుడుకి చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేసింది. సత్తా ఉన్నప్పటికీ రాయుడు ఛాన్స్ మిస్సయ్యాడని తెలుగువాళ్లంతా బాధ పడ్డారు. తనకు చోటు దక్కకపోవడం పట్ల రాయుడు కూడా స్పోర్టీవ్‌గా తీసుకున్నాడు. అయితే… మాజీలు మాత్రం సెలక్టర్ల తీరు తప్పుపట్టారు. ప్రపంచకప్‌లో రాయుడు ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐ పునరాలోచించిందేమో.. ఇప్పడు రాయుడుకి ప్రపంచకప్ బెర్త్ ఖరారైంది. రాయుడుతో పాటు పంత్, నవదీప్ సైనీలను కూడా జట్టులో తీసుకున్నారు.
అయితే… ఈ ముగ్గురినీ స్టాండ్ బై ఆటగాళ్లుగా బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచకప్ అనేది సుదీర్ఘ టోర్నీ. ఈమధ్యలో ఆటగాళ్లెవరైనా సరే గాయాలపాలయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు స్టాండ్ బై ఆటగాళ్ల సేవలు వినియోగించుకుంటారన్నమాట. ప్రస్తుతం ఉన్న 15మందిలో ఎవరైనా గాయపడితే… ఆ స్థానంలో వీళ్లలో ఒకరిని జట్టులోకి తీసుకుంటారు. ఓరకంగా రాయుడు, పంత్‌లకు ఇది ఊరటనిచ్చే విషయమే.