ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ ప్రత్యర్థి పార్టీల నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు… వారి కుటుంబ సభ్యులపైనా ఘాటు విమర్శలు చేస్తూండటం రివర్స్ అవుతోంది. గతంలో.. ఏపీకి వచ్చి లోకేష్కా పితాజీ అంటూ… వ్యాఖ్యానించి… తీవ్రమైన విమర్శలను మూటగట్టుకున్న మోడీ… ఈ సారి… నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నుంచి.. చీవాట్లు తినాల్సి వచ్చింది. చంద్రబాబు.. లోకేష్ కోసం పని చేస్తున్నారనే … ఆరోపణలు చేసేందుకు.. కుటుంబం అంశాన్ని ప్రస్తావించారు మోడీ. దానికి చంద్రబాబు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అసలు కుటుంబమే లేనోడికి.. కుటుంబబంధాలు.. ప్రేమాభిమానాలు ఏం తెలుస్తాయని.. ప్రజలను ఎలా ప్రేమిస్తారని.. ఆయన ఘాటుగానే కౌంటర్ ఇవ్వడంతో… ఆ విషయంలో బీజేపీ నేతలు మళ్లీ మాట్లాడలేకపోయారు. ఇప్పుడు.. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తూ… మోడీ .. శరద్ పవార్ పై అవే విమర్శలు చేశారు.
శరద్ పవార్ కుటుంబంలో విబేదాలున్నాయని.. ఆయన మేనల్లుళ్లు ఆయన మాట వినడం లేదని.. అందుకే ఎన్నికల బరిలోకి దిగలేదని… ఓ సభలో విమర్శలు చేశారు. దానికి శరద్ పవార్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనకు కుటుంబం ఉందని.. కుటుంబంలో అందరూ ఉన్నారని.. తమ మధ్య సమస్యలు ఉంటే.. మీకెందుకని.. సూటిగానే ప్రశ్నించారు. తనకు కటుంబ బంధాలు, బాంధవ్యాలు ఉన్నాయని.. మోడీకి ఏమున్నాయని ప్రశ్నించారు. తనను చూసుకునేందుకు బంధువులున్నారని.. మోడీకి ఎవరున్నారని… ఎద్దేవా చేశారు. కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో చేతకాని వ్యక్తి.. ఇతరుల కుటుంబాల గురించి చెబుతున్నారని.. సెటైర్ వేశారు. ఓ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారిపోతాడని అనుకోలేదన్నారు.
ప్రధానిగా మోదీ ప్రచారం… చాలా దిగువ స్థాయిలో ఉంటోందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే వ్యక్తిగత విమర్శలు లేకపోతే కుటుంబ విమర్శలు.. ఇంకా కాకపోతే.. పాకిస్తాన్తో లింక్ పెట్టి విమర్శలు చేయడమే మోడీ ఎజెండాగా పెట్టుకున్నారు. తన ప్రచార తీరుపై… తీవ్రమైన విమర్శలు వస్తున్నా.. ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.