ఎన్నికలకు ఫలితాలకు మధ్య చాలా రోజుల గ్యాప్ ఉంది. ఈ మధ్యలో.. ఎవరికి విజయమన్నది.. ఎవరూ నిర్ధారించుకోలేకపోతున్నారు. అందుకే కౌంటింగ్ అనంతరం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. అనేక రకాలుగా లెక్కలేసుకుని.. దానికి తగ్గట్లుగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ పరాజయం ఖాయమని.. వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. అయితే.. తమది ఏకపక్ష విజయమని టీడీపీ చెబుతోంది. పోటీ మాత్రం నువ్వా..నేనా అన్న రీతిలో జరిగిందన్న అంచనాలున్నాయి. ఎవరికైనా 90కి అటూ ఇటూగా అసెంబ్లీ స్థానాలు వచ్చి… మిగిలిన సీట్లు.. ప్రతిపక్షానికి వస్తే.. అది చాలా… క్లిష్టమైన విషయం. ఓ పార్టీకి మెజార్టీ ఉంటుంది కానీ.. జంప్ జిలానీల కాలంలో.. ఏమైనా జరగొచ్చు. అందుకే రెండు పార్టీలు… ప్రత్యర్థి పార్టీల్లో గెలుస్తారు అనుకుంటున్న ఓ పది మందితో పరిచయాలు పెంచుకుంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నందునే వైసీపీ తాము గెలవబోతున్నామనే ప్రచారాన్ని ఉద్ధృతంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. టీడీపీ నేతలకు ఇప్పటికే ఈ తరహా సమాచారం రావడంతో… చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్దులందరితో టచ్ లో ఉండాలని ముఖ్యమంత్రి జిల్లా మంత్రులను ఆదేశించారు. కొంతమంది వైసిపి నేతలు సెక్రటేరియట్ లోని కొంతమంది అధికారులకు ఫోన్ చేసి ఫైళ్ల కదలికలపై చేస్తున్న సూచనలు ఆరా తీస్తున్న వైనం కూడా టీడీపీలో కలకలం రేపుతోంది.
మరో వైపు టీడీపీ నేతలుకూడా.. ఈ విషయంలో… తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. కచ్చితంగా గెలుస్తారని భావిస్తున్న పదకొండు మందితో… టీడీపీ నేతలు టచ్లోకి వెళ్లారంటున్నారు. జగన్ వ్యవహారశైలి కారణంగా.. ఇబ్బంది పడిన వారిని గుర్తించారు. టిక్కెట్ల విషయంలో.. డబ్బుల దగ్గర… వైసీపీ హైకమాండ్.. బాగా సతాయించిన వారిని గుర్తించి… వారికి.. ఆర్థిక మద్దతు ఎర వేస్తున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు ఫలితాలు రాకముందే… ఈ తరహా ప్రయత్నాలు చేస్తూండటంపై… రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.