ఇప్పటికే దేశంలో మహాత్మాగాంధీ పేరుతో అసలైన మహాత్ముడు… సరిహద్దు గాంధీ పేరుతో మరికొంత మంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వీరి జాబితాలో.. కొత్తగా రామ్‌గోపాల్ వర్మ..మరో కొత్త నేతను తీసుకొస్తున్నారు. ఆయనేవరో కాదు.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్. కేసీఆర్ జీవిత చరిత్రను…తెరకెక్కించాలని..రామ్ గోపాల్ వర్మ సంకల్పించారు. ఈ మేరకు.. లోగో తయారు చేసి… ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఆయనకు…ఎగ్రెసివ్ గాంధీ అనే బిరుదు ఇచ్చారు. సినిమా టైటిల్ “టైగర్ కేసీఆర్ “. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపించారన కోణంలో.. ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తోంది. ” ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’ అని క్యాప్షన్‌గా పెట్టారు.
ఇది కేటీఆర్ తండ్రి బయోపిక్ అని చెబుతూ.. ఆంధ్ర పాలకుల రాజ్యంలో తెలంగాణ వాసులు పడుతున్న ఇబ్బందులని చూసి తట్టుకోలేక కేసీఆర్ ఏం చేశారన్నది సినిమాలో చూపిస్తామని వర్మ ప్రకటించారు. రామ్‌గోపాల్ వర్మ ఇలాంటి..బయోపిక్‌ల పేర్లతో ఇప్పటికి చాలా… టైటిల్స్ రిలీజ్ చేశారు. ఇందులో నయీం దగ్గర్నుంచి శశికళ వరకూ చాలా ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా.. కేసీఆర్ కూడా చేరారు. దీన్ని తెరకెక్కిస్తారా.. లేకపోతే… టైటిల్ ప్రకటనకే సరిపుచ్చుతారా అన్నది.. ఆయనకు దొరికే నిర్మాతల్ని బట్టి ఉండొచ్చు. సమీపంలో ఇక ఎన్నికలేమీ ఉండకపోవచ్చు కాబట్టి… ఇప్పుడల్లా… ఆ సినిమా తెరకెక్కే అవకాశాలు లేవంటున్నారు.
పైగా రామ్ గోపాల్ వర్మ మైండ్ సెట్ ప్రకారం… పాజిటివ్‌గా సినిమాలు తీయడం అనేది ఉండదు. ఏదైనా నెగెటివే. ఇప్పుడు కేసీఆర్ గురించి ఆయన పాజిటివ్ గా సినిమా తీస్తారని ఎవరూ అనుకోవడం లేదు. గతంలో..కేసీఆర్ ముక్కుపై.. అందంపై అనేక కామెంట్లు చేసి ఉన్నారు వర్మ. ప్రస్తుతం వర్మ.. ‘కోబ్రా’ అనే చిత్రంలో నటుడిగా కనిపించబోతున్నారు.