రాను రాను ప్రేక్షకులు మారుతున్నారు. యువరక్తం టాలీవుడ్ లోకి వస్తోంది. కొత్త సినిమాను తెరపైకి తెస్తోంది. దాంతో హీరోలు కూడా మారుతున్నారు. ధైర్యం చేస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి. కానీ ఒకే ఒక్క హీరో మాత్రం ఇంకా మారడానికి కిలోమీటర్ల దూరం వెనకే వున్నట్లు కనిపిస్తోంది.
సీనియర్లు నాగ్, వెంకీ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. బాలయ్య పద్దతి వేరు. చిరంజీవి సంగతి సరే. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్లంతా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా మడత నలగని చొక్కా, గ్లామర్ ఇంచ్ కూడా చెడని ఫేస్, డిస్కో పాటలు, ఇలాంటి వ్యవహారాల సినిమాలనే అంటిపెట్టుకుని వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
ఆయన దృష్టిలో వెరైటీ అంటే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చే యడం తప్ప వేరు కాదన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. ఆ మెసేజ్ కూడా హీరో కింద స్థాయిలో వుండి ఇవ్వడు. మల్టీ మిలియనీర్ గా వుండాల్సిందే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, అలాగే మహర్షి అడియో పరిశీలిస్తే, పాటల స్టయిల్ చూస్తుంటే ఆ లైన్ అఫ్ ఆర్డర్ అంతా ఒకేలా అనిపిస్తుంది. ఓ డిస్కోసాంగ్ టైపు, ఓ పర్సనల్ గ్లోరిఫై టైపు సాంగ్, ఇలా…ఇలా..
సుకుమార్, అడవులు, ఎర్రచందనం, అక్కడ కాస్త డీ గ్లామర్ పాత్ర అన్నారనే మహేష్ బాబు రిజెక్ట్ చేసారనే గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో కథకు అడవి పక్కన వున్న పట్నానికి మార్చి, హీరోయిన్ ను జోడించినా ఓకె చేయలేదని టాక్.
అలాగే సందీప్ వంగా అర్జున్ రెడ్డి మాదిరిగా ఓ పాత్ బ్రేకింగ్ లైన్ చెప్పినా మహేష్ నో అనేసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
రాబోయే అనిల్ రావిపూడి సినిమా ఎలా వుంటుందన్నది తెలియాలి. అవుట్ అండ్ ఫన్ అయినా, అందులో కూడా విజయశాంతి క్యారెక్టర్ మెసేజ్ ఓరియెంటెడ్ గా వుంటుందని తెలుస్తోంది. మరి అవుట్ అండ్ అవుట్ ఫన్ సినిమాతో అయినా మహేష్ తన రొటీన్ బ్రేక్ చేస్తారని ఆశిద్దాం.
ఇలా బ్రేక్ చేయకుండా ఒకటే టైపు సినిమాలు చేసుకుంటూ వెళ్తే మహేష్ బాబు కూడా సీనియర్ హీరోల జాబితాలోకి చేరిపోయే ప్రమాదం వుంది.