ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికారంలోకి వచ్చేస్తున్నామని.. మొదటి రెండు రోజులు వైసీపీ నేతలు పార్టీలు చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్.. “గౌరవనీయమైన ముఖ్యమంత్రి” అనే నేమ్‌ప్లేట్‌ను….”భయంకరమైన” స్పెల్లింగ్ మిస్టేక్‌తో రూపొందించి.. జగన్ చేతిలో పెట్టి పోయారు. అది మరింత కాన్ఫిడెన్స్ పెంచింది. ఇప్పుడు… వైసీపీ నేతలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా.. విజయసాయి రెడ్డి … వర్క్ ప్రారంభించేశారు. ఆయన ఆఫీసులో లెక్కలు వేసే పనులు ఇరవై నాలుగు గంటలూ జరుగుతున్నాయి. ఆ లెక్కల ప్రభావం రాష్ట్రంలో పలు చోట్ల కనిపిస్తోంది.
పర్సెంటేజీల నుంచి పనిష్మెంట్ల వరకూ..! ఆడిటర్ గారు పనిలో నిమగ్నమయ్యారు..!
తిరుపతిలో ఓ పత్రికా కార్యాలయం పక్కన ఐదెకరాల స్థలం ఉంది. ఆ స్థలం మీద కొన్ని లిటిగేషన్లు ఉన్నాయి. చాలా విలువైనది కావడంతో.. ఇప్పటికే అక్కడ టిక్ మార్క్ పెట్టారు. దాని లెక్కలు సరి చేయడానికి.. ఏర్పాట్లు చేసుకున్నారు… ఇది తిరుపతిలో అందరికీ తెలిసిపోయింది.. ఎందుకంటే.. సదరు వైసీపీ నేతలు.. ఫలితాలు రాగానే లెక్కలు సరి చేయబోతున్నామని ముందుగానే అందరికీ చెప్పడమే.. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే… ఏపీ మొత్తంగా.. ఇప్పుడు.. జిల్లాల వారీగా.. వైసీపీ నేతలు… జాబితాలు రూపొందించే పనిలో ఉన్నారు. ఆ జాబితాలో.. మరీ చిన్న చిన్నవి కాకుండా.. తమ స్థాయికి తగ్గట్లుగా ఉండేలా రూపొందించాలని.. వారికి లెక్కల మాస్టార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందులో లిటిగేషన్ ఆస్తులు మాత్రమే కాదు… ప్రభుత్వం తరపున చేపట్టిన కాంట్రాక్టులు, చేపట్టబోతున్న కాంట్రాక్టులు.. ఇలా.. దాదాపుగా ప్రతీ అంశంపైనా… వివరణాత్మక లెక్కలు సేకరించమని ఆదేశాలు వచ్చాయి. వారి దగ్గర నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి… అసలైన లెక్కలు రెడీ చేసే పనిలో విజయసాయిరెడ్డి ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
గెలుపొందడం అంటే ప్రజలపై సర్వాధికారాలు పొందడమా..?
” కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయాల్సిన కమిషన్ల దగ్గర్నుంచి లిటిగేషన్ ల్యాండ్స్ వరకూ.. ” అన్ని రకాల సమాచారాన్ని సేకరించి… ముందుగానే లెక్కలేస్తే… మే 23 తర్వాత పెద్దగా టెన్షన్ లేకుండా పనులు చక్కబెట్టుకోవచ్చన్నది వైసీపీ నేతల ఆలోచన. ఇప్పుడు ఎలాగూ ఖాళీగా ఉన్నారు కాబట్టి.. ఆ పని చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అవసరమైన సమాచారం కోసం… ప్రభుత్వం వద్ద ఇప్పటికే తన మనిషిని పెట్టేసుకున్నారు. ఎన్నికల సంఘం ఆసరాతో.. జగన్‌తో పాటు.. అక్రమాస్తుల కేసులో సహ నిందితునిగా ఉన్న.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. అధికారవర్గాలకు సీఎం లాంటి సీఎస్ సీటులో కూర్చున్నారు. అక్కడ్నుంచి ఫుల్ కోపరేషన్ ఉంది. ఏ ఏ ఫైళ్లు వస్తున్నాయో.. ఏఏ ఫైళ్లపై సంతకాలవుతున్నాయో .. చంద్రబాబు కన్నా ముందే.. లెక్కల మాస్టారికి తెలిసిపోతున్నాయి. దాంతో ఆయన… ఆపాలనుకున్న వాటిని ఆపాలని… లేకపోతే… తాము వచ్చిన తర్వాత కటకటాలకు వెనక్కు పంపుతామని.. అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇది రహస్యం ఏమీ కాదు. నేరుగానే చెబుతున్నారు.
తొమ్మిదేళ్ల లోటును పూడ్చేయబోతున్న ఆడిటర్..!
నిజానికి విజయసాయిరెడ్డి లెక్కల వల్లే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయాడని.. జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం.. తన పంధా మార్చుకోరు. ఆడిటర్‌ను కాబట్టి.. తన లెక్కే కరెక్ట్ అంటూ ఉంటారు. ఐదేళ్లలోనే.. తాము సాధించిన పురోగతి.. గత తొమ్మిదేళ్లుగా ఆగిపోయింది కాబట్టి… ఆడిటర్‌గా ఆయనకు .. చాలా చిరాకుగా ఉంటుంది. అందుకే మరో నెల తర్వాత తమకు వస్తుందనుకుంటున్న అధికారంతో.. ఈ తొమ్మిదేళ్ల గ్యాప్‌ను పూడ్చుకోవడానికి ముందస్తుగానే కసరత్తు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు… జగన్ లెక్కలన్నీ ఆయనే చూసేవారు. కనీసం పది శాతం.. వాటాను… టార్గెట్ గా పెట్టుకున్నారు. దాని కోసం బెదిరింపులు… కూడా చేశారని కేసులున్నాయి. ఇప్పుడు.. గత ఐదేళ్లలో.. ప్రభుత్వం వద్ద నుంచి పనులు తీసుకున్న వారి నుంచి కూడా వాటాలు వసూలు చేయాలనే ఆలోచన జరుగుతోందట. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ల లిస్ట్ బయటకు తీశారని.. వారు చేసిన పనులు.. తీసుకున్న అడ్వాన్సులు వారీగా లెక్కలేస్తున్నారని అంటున్నారు.
ఆయనొస్తాడని… జనం అంత భయపడుతున్నారేంటి..?
ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే కాదు… మెజార్టీ వైసీపీ నేతలు కూడా.. తమ తమ రేంజ్‌లలో.. లెక్కల పనిలో బిజీగా ఉన్నారు. వచ్చే నెల ఇరవై మూడో తేదీ తర్వాత తమ రేంజ్లో ఏమేం చేయాలో రెడీ చేసుకుంటున్నారట. వారు కూడా వారి స్థాయిలో జిల్లా అధికారులను బెదిరించడం… ఎదురు తిరిగిన వాళ్లపై… దాడులకు తెగబడటం లాంటివి చేస్తూనే ఉన్నారు. వీరి హడావుడి చూసి ప్రజల్లో నిజంగానే భయం పెరిగిపోయింది. అధికారం వస్తుందో రాదో .. తెలియదు కానీ… వచ్చేస్తుందని ఇంత చేస్తున్నారు… నిజంగా వస్తే… సామాన్యుల్ని బతకనిస్తారా.. అన్నదే వారి భయం. ఆ భయాలను.. నిజం చేసే పనిలో .. లెక్కల మాస్టారు విజయసాయిరెడ్డి… ఆయన అనుచరులు… రెడీగా ఉన్నారు. మే 23 తర్వాతే అందరి లెక్కలు తేలనున్నాయి. అప్పటి వరకూ భరించాల్సిందే..!