మళ్లీ రావా సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకుని, జెర్సీతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. సహజంగానే సక్సెస్ వెంట పరుగెడుతుంది ఇండస్ట్రీ. అందుకే ఇప్పుడు గౌతమ్ కు అభినందనలు మొదలయ్యాయి. ఎంక్వయిరీలు స్టార్ట్ అయ్యాయి. తరువాత సినిమా ఎవరితో? ఏ బ్యానర్ కు అన్నది కామన్ క్వశ్చన్.
అయితే గౌతమ్ మూడో సినిమా మాత్రం నిర్మాత ఎన్వీ ప్రసాద్ కే. కారణం మరేమీ కాదు. మొదటి సినిమా టైమ్ లోనే ఎన్వీ ప్రసాద్ అడ్వాన్స్ ఇచ్చారు. రెండో సినిమా చేయాల్సి వుంది. అయితే ఆయన కాస్త వత్తిడిలో వుండడం వల్ల రెండో సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు ఇచ్చారు. ఇప్పుడు మూడో సినిమాను మాత్రం ఆయనే నిర్మించే పనిలో వున్నారు.
గౌతమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తే, దానికి నప్పే హీరోను తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఎన్వీ ప్రసాద్ కు అటు మెగా క్యాంప్ లోనూ, ఇటు మహేష్ దగ్గర మంచి రాపోనే వుంది. అందువల్ల ఎవరు కావాలన్నా సమస్య వుండదు. ఎటొచ్చీ గౌతమ్ స్క్రిప్ట్ రెడీ కావాలంతే.