భారతీయ జనతా పార్టీ నేతలు.. దేశం మొత్తంపై తమకే పెత్తనం ఉందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పొరుగు దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారని.. వారి కోసం.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ అనే… పద్దతిని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఈ రిజిస్టర్లో ఉన్న వారు మత్రమే భారతీయులు. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు వారి కన్నా… బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే అధికంగా ఉన్నారన్న భావనతో దీన్ని తీసుకు వచ్చారు. అక్కడి ప్రజల్లోనూ.. తాము మైనార్టీలం అయిపోతున్నామన్న భావన ఉండటంతో.. ఓ రకంగా అంగీకారం లభించింది. అయితే… బీజేపీ.. తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడింది. హిందువులు దేశంలోకి వచ్చి ఉంటే.. వారికి పౌరసత్వం ఇస్తామని.. ఎన్నార్సీలో చోటు కల్పిస్తామని చట్టం చేసేందుకు ప్రయత్నించాు. దీంతో.. ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. ఈ మంట నుంచి ఇప్పుడు బీజేపీ రాజకీయం కాచుకుంటోంది.
ఈ ఎన్నార్సీని ఇప్పుడు దేశమంతా ఇంప్లిమెంట్ చేస్తామని.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్నార్సీ రిజిస్టర్ లో చేరుస్తామని… దేశం కాని వాళ్లను బయటకు పంపుతామని చెబుతున్నారు. బహుశా అమిత్ షా ఉద్దేశం ప్రకారం… భారతీయ జనతా పార్టీకి సమర్థించని ప్రతి ఒక్కరూ… భారతీయులు కాదన్న ఉద్దేశం కావొచ్చన్న సెటైర్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం తమ సొత్తు అన్నట్లుగా.. దేశంలో ఎవరు ఉండాలో.. తామే సర్టిఫికెట్లు ఇస్తామన్నట్లుగా.. అమిత్ షా మాట్లాడుతూండటం… ప్రజలు షాక్ ఇచ్చేదే.
హిందువులు తమకు ఓట్లు వేస్తారు కాబట్టి.. పక్క దేశాల నుంచి వచ్చి తిష్టవేసినా.. వారికి పౌరసత్వం ఇస్తారు. అదే.. దేశంలో నిఖార్సైన భారతీయులు మాత్రం… అమిత్ షా నుంచి తాము భారతీయులమనే సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. ఇప్పటికే.. మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే.. ముస్లింలకు ఓట్లు తీసేస్తారనే ప్రచారం జరుగుతోంది. దానికి ఈ ఎన్నార్సీనే కారణం. ఇప్పుడు అమిత్ షా కూడా.. ఈ ఎన్నార్సీనే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి… తమ ప్లాన్ను పరోక్షంగా అంగీకరించారు. దేశభక్తి నీడలో.. బీజేపీ… దేశ ప్రజల్ని అనుమానించే స్థాయికి చేరిపోయిందన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయంటే.. అది వారి తప్పు కాదు.. బీజేపీ అగ్రనేతల ఓట్ల రాజకీయమే కారణం.