నా ఇష్టం నాగేంద్రబాబు.. మనది కాకపోతే ఢిల్లీ కూడా దగ్గర అనే టైపులో ఉన్నారు. ఎన్నికలకు ఇష్టం వచ్చినట్లు ఏపీలో వ్యవహారాలపై చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు.. తెలంగాణ దగ్గరకు వచ్చే సరికి.. విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా.. అదీ కూడా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా కవరింగ్ ఇచ్చి వీడియో పెట్టారు. నిజానికి ఏపీలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు లేవు. ఫలితాలలోనూ.. ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఎగ్జామ్ ప్రక్రియ మొత్తం సాఫీగా జరిగిపోయింది. కానీ.. నాగేంద్రబాబు మాత్రం.. తెలంగాణ విషయంలో నోరెత్తలేని తన నిస్సహాయతను అలా కవర్ చేసుకున్నారు.
అయ్యా..నాగబాబు గారూ..! తప్పు తెలంగాణ ఇంటర్బోర్డుదండి.. పిల్లల పేరెంట్స్‌ది కాదు..!/span>
తెలంగాణలో విద్యార్థులు… పక్క విద్యార్థులతో తల్లిదండ్రులు పోల్చి చూడటం వల్ల ప్రాణాలు తీసుకోవడం లేదు. తాము ఏడాది అంత కష్టపడి పరీక్ష రాస్తే… ఫెయిల్ అవ్వడం ఏమిటన్న నిరాశతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ.. దాదాపుగా పదహారు మంది అలా ప్రాణాలు తీసుకున్నారు. వీరెవ్వరూ.. ఇతరులతో పోల్చుకుని.. తమ ప్రాణాలు తీసుకున్న వారు కాదు. కష్టపడిన తాము ఎలా ఫెయిలయ్యామన్న బాధతోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే.. తెలంగాణ మొత్తం ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండి పడుతున్నారు. దాదాపుగా తొమ్మిదిన్నర లక్షల మంది ఇంటర్ విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. అంతా అధికారుల వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటున్నారు. తప్పంతా వాళ్లదే. పిల్లలది కాదు. కానీ నా ఇష్టం నాగబాబు.. ఈ విషయంలో మాత్రం.. తెలంగాణ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే ధైర్యం లేకపోవడంతో.. పాపం అమాయకులని.. పిల్లలపైనే నిందలేస్తున్నారు. వారి తల్లిదండ్రులను.. అనుమానిస్తున్నారు.
ఏపీలో విద్యార్థులు హ్యాపీ బాసూ..! ఆ రాష్ట్రం ఎందుకు అవమానపడాలి..!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగాయి. పద్దతి ప్రకారం వాల్యూయేషన్ చేశారు. మార్కుల విషయంలోనూ.. ఎవరికీ అనుమానాల్లేవు. మరింత బెటర్‌గా తమకు మార్కులు వస్తాయని అనుకున్న వారు… రీ కౌంటింగ్ పెట్టించుకుంటున్నారే కానీ.. వారు..ఎగ్జామ్ ప్రక్రియపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. ముఖ్యంగా… 99 మార్కులు వచ్చే వారికి.. సున్నా వేసి.. సున్నం కొట్టిన సందర్భం లేదు. అంతకు మించి ఏమిటంటే.. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కరంటే.. ఒక్క విద్యార్థి కూడా.. తాను కష్టపడినా.. ఫెయిలయ్యాననే బాధతో ప్రాణం తీసుకోలేదు. అయినా నా ఇష్టం నాగబాబు… దీన్ని జనరలైజ్ చేసేస్తున్నారు. తెలంగాణలో మాత్రమే కాదు.. ఏపీలో కూడా ఆత్మహత్యలు ఉన్నట్లుగా.. అది తెలుగు రాష్ట్రాలకు అవమానం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇది అచ్చంగా ఆంధ్రప్రదేశ్‌ను అవమానించడమే. తెలంగాణ ఇంటర్ బోర్డు విషయంలో.. అక్కడి ప్రభుత్వాన్ని.. వ్యవస్థను విమర్శించడం చేతకాకపోతే.. కామ్‌గా ఉండాలి.. అంతే కానీ… ఏమీ లేని ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏదో జరుగుతున్నట్లు చెప్పడం కరెక్ట్ కాదు.
ఏపీని అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని అనలేకపోతే కామ్‌గా ఉండాలి..! ఆత్మవంచన ఎందుకు..?
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నాగబాబు నా ఇష్టం స్పందన అందర్నీ ఆశ్చర్యపరించింది. ఏదో మానసిక శాస్త్రవేత్తలాగా.. తల్లిదండ్రుల్ని తప్పు పడుతూ… పిల్లల్ని వాళ్లే ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా చెప్పడం … ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేక.. జనరలైజ్ చేసిన వ్యూహారం లాగా ఉంది. నాగబాబు ఎన్నికలకు ముందు నా ఇష్టం పేరుతో పెట్టిన వీడియోల్లో.. ఏపీలో ఏ చిన్న విషయాన్ని వదిలి పెట్టలేదు. చివరికి .. పవన్ అభిమానుల్ని పోలీసులు కొట్టారంటూ.. గుంటూరు వెళ్లి హడావుడి చేశారు. తెలంగాణ విషయం వచ్చే సరికి ఆయన అణిగిమణిగి ఉంటున్నారు. వీడియోల విషయంలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఎన్ని మాటలన్నా.. ఎంత బురద చల్లినా.. అది… తాను నివసించని .. తనకు ఏ ఆస్తులు లేని.. ఏపీపైనే కానీ.. తెలంగాణ విషయంలో మాతరం నోరెత్తే దైర్యం చేయలేరు. సొంత రాష్ట్రం పేరుతో.. ఏపీపై ఎంత విషం అయినా చిమ్మవచ్చు కానీ… నివాసం ఉండే రాష్ట్రంపై మాత్రం ఈగవాలనీయరు. ఇది ఖచ్చితంగా ఆత్మవంచనే..!