మొత్తానికి ఏడాది కాలం గ్యాప్ తరువాత స్టయిలిష్ స్టార్ బన్నీ సినిమా షూటింగ్ కు వస్తున్నాడు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారయ్యే అలకనంద(వినిపిస్తున్న టైటిల్) సినిమా షూట్ బుధవారం ప్రారంభమవుతోంది. నగరంలోని పోలీస్ లైన్స్ ప్రాంతంలో షూట్ ప్రారంభమవుతుంది.
సరైన ప్రాజెక్టు కోసం చిరకాలం వెయిట్ చేయడం, తీరా సినిమా సెట్ అయినా త్రివిక్రమ్ స్క్రిప్ట్ సెట్ కాకపోవడం వంటి కారణాలతో బన్నీ అలా ఖాళీగా వుండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సెకండాఫ్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు. అయితే ఆలస్యం అయిపోతుందని సెట్ మీదకు వెళ్లిపోతున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ తో, బన్నీతో పూజా హెగ్డే రెండో సారి నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి
ఈ సినిమాను దసరాలోపు ఫినిష్ చేసి, సైరా రాకపోతే, దసరాకు బరిలోకి దింపాలన్నది ప్లాన్. ఆ తరువాత కూడా బన్నీ సినిమా రెడీగా వుంది. శ్రీరామ్ వేణుతో చేయబోయే సినిమాకు అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా వుంచారు.