ఆర్.ఎక్స్ 100తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. తన తదుపరి సినిమా నాగచైతన్యతో ఫిక్స్ అయ్యింది. ‘మహా సముద్రం’ అనే స్క్రిప్టుని చైతూ కోసం రెడీ చేశాడు అజయ్. ఇందులో సమంతని కథానాయికగా ఎంచుకోవాలన్నది ఆలోచన. ఇందులో చైతూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని టాక్. ‘తఢాకా’లో డూప్లికేట్ పోలీస్ గా కనిపించాడు చైతూ. తను పోలీస్ పాత్ర చేయడం ఇదే తొలిసారి. మహా అనే అమ్మాయి కథ ఇది. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. అందుకే ‘మహా సముద్రం’ అనే టైటిల్ పెట్టుకున్నాడు అజయ్. మాఫియా నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, యాక్షన్ ఎలిమెంట్స్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న సీరియస్ డ్రామా అని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పట్టాలెక్కబోతోంది.