“తప్పు చేస్తే నా ఇంటిపైనా ఐటీ దాడులు జరుగుతాయి..” ఇదీ ఎన్నికల ప్రచారంలో.. నరేంద్రమోడీ చేసిన ప్రకటన. మోడీ ఈ ప్రకటన చేసిన సమయంలోనే… మోహిసిన్ అనే ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ పై స్టే విధిస్తూ…సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఇంతకీ ఈ మొహిసిన్ ఎవరంటే… మోడీ హెలికాఫ్టర్ ను చెక్ చేసినందుకు సస్పెండైన ఐఏఎస్ అధికారి. ఒడిషాలో ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మొహిసిన్.. తన విధుల్లో భాగంగా.. ప్రధానమంత్రి హెలికాఫ్టర్‌ను చెక్ చేశారు. దీనిపై ఆగ్రహించిన ఈసీ.. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా.. ఆయనను సస్పెండ్ చేసింది. ఎస్పీజీ భద్రత ఉన్న వారి వాహనాలను చెక్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని.. వాటిని ఉల్లంఘించినందుకు.. సస్పెండ్ చేశారని ఈసీ మీడియాకు రిలీజ్ చేసిన ప్రకటనలో పేర్కొంది.
అయితే.. అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం అదేమీ లేదు. ఎందుకంటే.. ఎస్పీజీ భద్రత ఉన్న వారికి కూడా.. ఎన్నికల అధికారుల తనిఖీల నుంచి మినహాయింపు లేదు. అలా ఇంత వరకూ ఏ చట్టమూ లేదు. దాంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించి… స్టే తెచ్చుకున్నారు. తన విధుల్ని తాను నిర్వర్తించినందుకు… సస్పెండ్ చేశారని… ఈసీపై న్యాయపోరాటం చేస్తానని.. మెహిసిన్ చెబుతున్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి అదీ.. ఎన్నికల కోడ్ ఉండగానే…. ఉంటే.. ఇక మామూలు రోజుల్లో.. మోడీ విషయంలో ఎవరైనా చిన్న అడుగు అయినా వేయగలరా..? మోడీ హెలికాఫ్టర్‌ను..నిబంధనల మేరకే చెక్ చేసినందుకే.. ఐఏఎస్ అధికారి.. సస్పెండ్ అయితే.. ఇక మోడీ ఇంటిపై రెయిడ్ చేసి. .ఐటీ అధికారులు ఉద్యోగం చేయగలరా..?.
దేశంలో ఇప్పుడు.. ఐటీ అధికారులందరూ ఓ మిషన్ మీద ఉన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతల మీద దాడులు చేయడమే వారి పని. ఏ ఒక్క బీజేపీ నేత కానీ.., ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన నేతపై కానీ.. ఒక్కటంటే.. ఒక్క దాడి జరగకపోవడం దానికి నిదర్శనం. అయినప్పటికీ.. మోడీ.. తన ఇంటిపైనా ఐటీ దాడులు చేయవచ్చంటూ.. భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆయన మిత్రపక్షాల్లో.. ఎంతో మంది.. ఇప్పటికీ.. ఐటీ, ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నా… ధీమాగా రాజకీయం చేసుకుంటున్నారు. ఎవరి దాకో ఎందుకు.. గాలి జనార్ధన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల వ్యవహారాలు, కేసులు అందరికీ తెలుసు. అయినా మోడీ మాత్రం వారిని దగ్గరకు తీశారు. జగన్ కేసుల విచారణ సాగడం లేదు. చివరికి.. ఈడీ డైరక్టర్ రెండేళ్ల కిందట.. పూర్తి సాక్ష్యాలతో లేఖ రాసి.. సీబీఐ తీరుపై అనుమానం వ్యక్తం చేస్తే.. దాన్ని కూడా తొక్కి పెట్టి.. తాను ఎవరికి చౌకీదార్‌నో నిరూపించారు. అయినప్పటికీ.. ఎన్నికల ర్యాలీల్లో మాత్రం… తన పైనా ఐటీ దాడులు చేసుకోవచ్చంటూ…ప్రకటిస్తూ ఉంటారు.