మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు రాజ్ థాకరే … హాట్ టాపిక్ అయ్యారు. ఆయన ఎమ్మెన్నెస్ అనే పార్టీకి అధ్యక్షుడు. ఎమ్మెన్నెస్ అంటే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన. శివసేన చీఫ్ బాల్‌థాకరే మేనల్లుడు. శివసేన పార్టీ ఈ రోజు..మహారాష్ట్ర రాజకీయాల్లో.. కీలక శక్తి ఉందంటే.. దాని వెనుక.. రాజ్‌థాకరే కృషే ఎక్కువ. పార్టీలో ఒకప్పుడు… నెంబర్ టూ పొజిషన్లో ఉండేవారు. అయితే.. బాల్ థాకరే కుమారుడు.. ఉద్దవ్.. పార్టీలో పెత్తనం తీసుకునే సరికి.. ఆ పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. ఓట్లను భారీగా సాధిస్తున్నప్పటికీ.. ఏ ఎన్నికలోనూ.. గొప్పగా సీట్లు సాధించలేకపోయారు. కానీ.. మహారాష్ట్రలో ఆయన క్రేజ్ ఆయనకు ఉంది. ఈ సారి రాజ్‌థాకరే మహారాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఆయన తన పార్టీకి ఓటు వేయమని చెప్పడం లేదు. ఎందుకంటే.. ఆయన పార్టీ పోటీ చేయడం లేదు. కానీ సభలు పెడుతున్నారు. అదే రాజకీయం. బీజేపీ, శివసేనను ఓడించాలని పిలుపునిస్తున్నారు. అంటే.. కాంగ్రెస్, ఎన్సీపీలను గెలిపించమనే.
రాజ్ థాకరే పార్టీ కి అసెంబ్లీ లో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు . కొద్దీ రోజుల క్రితం ఆ ఎమ్మెల్యే కూడా శివ సేన పార్టీ లో చేరిపోయాడు. కొందరు కార్పొరేటర్లు మినహా మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ లేరు . లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి రాజ్ థాకరే పార్టీ ఒక్కసారిగా జూలు విదిల్చి కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి మద్దతుగా రాజ్ థాకరే రంగం లో దిగారు. లోక్ సభ బరిలో అభ్యర్థులను పోటీకి పెట్టకుండా రాజ్ థాకరే తన శక్తియుక్తులన్నీ ప్రచారానికి వినియోగిస్తున్నారు. కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ – శివ సేన కూటమికి ఇది చెక్ పెట్టినట్లు అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన బీజేపీ కి అనుకూలంగా ప్రచారం చేసింది. గుజరాత్ కూడా వెళ్లి బీజేపీ కి ప్రచారం చేశారు . కానీ ఇప్పుడు మోడీ తెస్తానన్న మంచి రోజులు తేలేదు కాబట్టి.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నాననంటున్నారు.
సౌత్ ముంబై లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మిళింద్ దేవరకు ముకేశ్ అంబానీ మద్దతు తెలపడం వెనుక కూడా రాజ్ థాకరే హస్తం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే ముకేశ్ అంబానీ , రాజ్ థాకరే మంచి స్నేహితులు. ముకేశ్ కాంగ్రెస్ అభ్యర్ధికి పూర్తి మద్దతు ప్రకటించారు ఆంటే … దేశ ప్రజలందరికీ ఇది ఒక సంకేతం. మోదీ ఓడిపోతున్నారు. అది నిజం … అని రాజ్ థాకరే పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. రాజ్ థాకరే… ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారారు.