మన యంగ్ హీరోలు అందరికీ ఇతర భాషల మీద కన్నుపడినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఎప్పడో మల్లూ వుడ్ లో పట్టు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు స్పైడర్ తో తమిళ మార్కెట్ లో తన వంతు ప్రయత్నం చేసాడు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో నాలుగు దక్షిణాది భాషల్లోకి ఎంటర్ అవుతున్నాడు. నోటాతో ఇప్పటికే తమిళ మార్కెట్ లో ప్రయత్నం చేసాడు.
నాని తన జెర్సీ సినిమాతో తమిళ మార్కెట్ లోకి వెళ్లాడు. లేటెస్ట్ గా శర్వానంద్ కూడా ఓ తెలుగు-తమిళ బై లింగ్వువల్ సినిమాకు ఓకె చేప్పినట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాత ఎస్ ఆర్ ఫ్రభు ఈ సినిమాను నిర్మిస్తారని టాక్.
ఇప్పటికే శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా ఒకటి రెడీగావుంది. 14రీల్స్ లో సంక్రాంతి టార్గెట్ గా మరో సినిమా ఒకె చేసారు. ఇది మూడోది అన్నమాట. ఈ తమిళ-తెలుగు సినిమాకు కొత్తదర్శకుడు కథ, కథనాలు అందిస్తారు.