ఇంటర్ ఫలితాల అవకతవకల వ్యవహారంపై.. ఏర్పాటైన త్రిసభ్య కమిటీ.. ఎట్టకేలకు విద్యాశాఖ కార్యదర్శికి తన నివేదిక అంద జేసింది. ఐదు రోజుల క్రితం… ఈ అంశంపై రగడ ప్రారంభమైనప్పుడు.. హడావుడికి.. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అందులో ముగ్గురు నిపుణుల్ని నియమించారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ కమిటీ.. అటు ఇంటర్ బోర్డులోని వ్యవహారాల్ని…. అటు… గ్లోబరీనా సంస్థ సాంకేతిక సామర్థ్యాన్ని కూడా… త్రిసభ్య కమిటీ పరిశీలన జరిపింది. అలాగే.. గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్ట్ ఎలా దక్కిందనే అంశాలపైనా కమిటీ వివరాలు సేకరించింది. ఈ విషయంలో.. అనేక అవకతవకలను కమిటీ గుర్తించినట్లు.. ప్రముఖ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. గ్లోబరీనా సంస్థ వద్ద అసలు ఫలితాలను ప్రాసెస్ చేసే సాఫ్ట్ వేర్ లేదని… అసలు కాంట్రాక్ట్ పొందడానికి గ్లోబరీనాకు ఎలాంటి అర్హతలు లేవని.. అయినా.. ఎలా… ఒప్పందం చేసుకున్నారనేది మిస్టరీగా ఉందనే విషయాన్ని త్రిసభ్య కమిటీ గుర్తించినట్లు… ఆ విషయాన్ని నివేదికలో పొందు పరచనున్నట్లు.. ఈనాడు వెల్లడించింది.
అలాగే.. ఇంటర్ బోర్డు అధికారుల వ్యవహారంపై కూడా.. అనేక లోపాలు గుర్తించినట్లు సమాచారం. ఇలా వార్తలు వచ్చిన తర్వాత.. అనూహ్యం గా కమిటీ ప్రాధాన్యతను కోల్పోయింది. సీఎం కేసీఆర్ సమావేశం పెట్టి.. ఫెయిలయిన అందరి పేపర్లూ.. మళ్లీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించడంతో… ఆ పనుల్లో.. అధికారులు బిజీ అయి త్రిసభ్య కమిటీని పట్టించుకోలేదు. అయితే.. ఇంటర్ బోర్డులో అవకతవకలు, గ్లోబరీనా వైఫల్యం, కాంట్రాక్ట్ పొందిన విధానం, న్యాయపరంగా ఎలాంటి ఒప్పందం లేకపోవడం వంటి అంశాలన్నింటినీ త్రిసభ్య కమిటీ ఎత్తి చూపడంతో.. దాన్ని తీసుకునే విషయంలో కావాలనే విద్యాశాఖ అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు మీడియాలో వస్తున్నాయి. చివరికి రెండు రోజుల తర్వాత కమిటీలో కీలకమైన అంశాలను తీసేసి.. పది పేజీల నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. సమస్య ఎక్కడ ఉంది… ఎలా పరిష్కరించాలనే సలహాలను మాత్రమే.. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యాశాఖ కార్యదర్శికి నివేదిక అందించిన తర్వాత … సభ్యులు మీడియాతో మాట్లాడలేదు. 10 పేజీల నివేదికను అందజేశామని పూర్తి వివరాలను విద్యాశాఖ కార్యదర్శి తెలియజేస్తారని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ నివేదికను .. చీఫ్ సెక్రటరీకి.. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అందించారు. నివేదికలోని అంశాలు పరిశీలించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మొత్తానికి సంచలనం సృష్టించిన ఇంటర్ ఫలితాల విషయంలో.. అసలు తప్పు చేసిన వాళ్లు… బయటపడిపోయారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.