టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆయన వంద ఎంపీ సీట్ల టార్గెట్ గా ఇప్పటికే కొన్ని పార్టీలతో మంతనాలు జరిపి… ఓ కూటమిని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. ఆయన మూడో విడత ఫెడరల్ ప్రంట్ టూర్లకు సిద్ధమవుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లక ముందు ఓ సారి.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతల్ని కేసీఆర్ కలిశారు. కొంత మందిని హైదరాబాద్ ఆహ్వానించారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే.. మరోసారి పర్యటనలకు వెళ్లివచ్చాయి. అయితే రెండు సందర్భాల్లోనూ.. పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ సారి.. ఎన్నికలు అయిపోతున్న తరుణంలో.. తన కూటమి ఉనికిని ఆయన చూపించాలని భావిస్తున్నారు.
అందుకే.. ఇప్పటి వరకూ తెర వెనుక జరిగిన ప్రయత్నాలను.. మరింత ముందుకు తీసుకెళ్లేందుకు… అనుకూలమైన ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చకు బయలుదేరుతున్నారు. రెండో సారి… ఫెడరల్ టూర్లకు .. స్వరూపానంద ఆశీస్సులు తీసుకునే బయలుదేరారు. ఈ సారి కూడా..కేసీఆర్.. స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం.. స్వరూపానంద.. అధిపతిగా ఉన్న శారదాపీఠం పరిధిలో ఉంది. ఆయన దైవసన్నిధానానికి రావడంతో… కేసీఆర్.. ఆయన వద్దకు వెళ్లారు. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలపై… కేసీఆర్ వివరించినట్లు సమాచారం. దిగ్విజయం అవుతుందని.. స్వరూపానంద ఆశీర్వదించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
అదే సమయంలో… స్వరూపానంద.. తాను జూన్లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతలు స్వీకరిస్తున్నానని… స్వీకారోత్సవానికి.. రావాలని కేసీఆర్ని ఆహ్వానించినట్లు సమాచారం. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో కార్యక్రమాలు జరుగుతాయి. అయితే కేసీఆర్ ఈ లోపే ఓ సారి ఏపీలో పర్యటింటే అవకాశాలు ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలను.. ఈ సారి మిత్రుడు జగన్ తో భేటీ ద్వారా ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో కేసీఆర్ – జగన్ భేటీ విజయవాడలో జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.