గ్లోబరీనా అనే సంస్థ.. కేటీఆర్ సన్నిహితులదని.. అందుకే ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని… తెలంగాణ రాజకీయాల్లో.. ఇంటర్ గొడవ ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతోంది. దీనిపై… తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ క్లారిటీ ఇచ్చారు. గ్లోబరీనా అనే సంస్థ పేరు.. గతంలో ఎప్పుడూ వినలేదని స్పష్టం చేశారు. కేవలం ఇంటర్ బోర్డుకు సంబంధించిన అవకవతవకలు బయటకు వచ్చిన తర్వాత … మీడియాలో మాత్రమే… గ్లోబరీనా గురించి తెలిసిందని ప్రకటించారు. ఇంటర్ బోర్డు అవకతవకల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని.. తప్పు చేసిన ఎవర్నీ వదిలి పెట్టదని ట్విట్టర్లో స్పష్టం చేశారు.
ట్విట్టర్లో అనేక ప్రశ్నలకు.. కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అయితే.. అత్యధికం… కేటీఆర్ ఎంచుకున్న ప్రశ్నలు.. ఎక్కువగా ఇంటర్‌కు సంబంధించినవి కాదు. అయితే.. ఎక్కువగా నెటిజన్లు..ఆ అంశంపైనే ప్రశ్నలు గుప్పించారు. కొంత మంది .. ఇంత మంది… ఇంటర్ బోర్డుపై ప్రశ్నలు అడుగుతున్నా… క్లారిటీ ఇవ్వడం లేదేమిటని నేరుగా ప్రశ్నించారు. దీంతో కేటీఆర్… ఏం క్లారిటీలో కావాలో చెప్పాలని… సదరు ప్రశ్న అడిగిన వ్యక్తినే ప్రశ్నించారు. ఆ సంఘటనల పట్ల తానూ బాధపడుతున్నానన్నారు. ఏదో మోసం ఉందని.. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం.. ఈ అంశాన్ని మరింత వివాదాస్పదం చేయవద్దని… విజ్ఞప్తి చేశారు.
ట్విట్టర్లో జరిగిన సంభాషణలో.. కేటీఆర్‌కు ఆంధ్రా రాజకీయాలపైనా ప్రశ్నలు వచ్చాయి. అయితే… ఎన్నికలు ముగిసిన తర్వాత తన అభిప్రాయాలను కేటీఆర్ దాచుకున్నారు. ఏపీ రాజకీయాలపై.. తనకు ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు… కేటీఆర్, కేసీఆర్ ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని.. వైసీపీ పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని అదే పనిగా ప్రచారం చేశారు. కానీ అనూహ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత సైలెంటయ్యాకు. ఇప్పుడు కేటీఆర్.. తనకు ఏపీ రాజకీయాలపై అసక్తి లేదని.. జగన్ సీఎం అవుతారో లేదో తెలియదన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో పోటీ చేసిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా సీఎం కావొచ్చన్నారు. మొత్తానికి… ఇప్పుడు వివాదం ఎందుకని కేటీఆర్ అనుకుంటున్నారో.. పోలింగ్ అయిపోయింది కాబట్టి.. భవిష్యత్ రాజకీయం కోసం ముందు జాగ్రత్తో కానీ… ఏపీ రాజకీయాలపై ఎప్పుడూ లేనంత సంయమనం పాటిస్తున్న కేటీఆర్.