నంద్యాల నుండి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిపారు. శనివారం ఈ సోదాలు జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఎస్పీవై రెడ్డి 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. వీరి కుటుంబం నుండి మరో ముగ్గురు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇప్పుడు బ్యాంకు అధికారుల ఫిర్యాదు కారణంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎస్పీవై రెడ్డికి చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల కోసం ఆయన గతంలో తీసుకున్న రుణాల విషయంలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే మూడు దశాబ్దాలకు పైగా నే పారిశ్రామికవేత్తగా ఉన్న ఎస్పీవై.రెడ్డి ఇంట్లో ఇప్పుడు ఐటీ సోదాలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి.