తీతలి తుపాన్ వస్తుందని… సమాచారం వచ్చినప్పుడు… వారం రోజుల ముందుగానే… రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. శరవేగంగా.. నిత్యావరసర వస్తువులు అక్కడికి చేర్చింది. తుపాను రాక ముందే.. వేల సంఖ్యలో కరెంటు పోల్స్‌ని చేర్చింది. వీలైనంత మేర ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏర్పాట్లు చేసుకుంది. ఫలితంగా.. తీతలి తుపాను తీవ్రమైన ఆస్తి నష్టాన్ని కలిగించినా… ప్రజలకు చాలా వేగంగా సాధారణ జనజీవితాన్ని మామూలు స్థితికి తీసుకురాగలిగారు. ఇప్పుడు… కూడా ఏపీని.. తుపాను ఫొని అంతే వణికిస్తోంది. కానీ.. పట్టించుకునేవారు లేరు. సీఎస్ వ్యవహరిస్తున్న తీరుతో.. సీఎం ఆదేశాుల తీసుకోవడానికి అధికారులు రెడీగా లేరు. సీఎస్… తుపానుపై ఇంకా దృష్టి పెట్టలేదు. దాంతో.. చంద్రబాబే… అధికారులకు సూచనలు చేస్తున్నారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు చేస్తూ ప్రకటన ఇచ్చారు.
ఫోని.. పెనుతుపానుగా మారి… ఈ నెల 30న దిశను మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటునుంచి ఈశాన్య బంగాళాఖాతం దిశగా మరలి కోస్తాంధ్ర తీరం వెంట ప్రయాణించి బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని పలు ప్రైవేటు వాతావరణ వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. మే ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ తీరం వెంటే అంటే 200 నుంచి 300 కి.మీ.దూరంలో ప్రయాణించే అవకాశాలున్నట్లు అవి తెలియజేస్తున్నాయి. అంటే.. ఇది చాలా తీవ్రమైన తుపాను. 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే.. మరో హుదూద్ లాంటి విపత్తు తలెత్తుతుంది. ఇప్పటికే.. ఏపీ తీరంలో ఉన్న పలు పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తుపాను ఏపీవైపు దూసుకువస్తున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని… తుపాను వల్ల రాష్ట్రానికి నష్టం కలిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. సీఎస్సా? ఎన్నికల సంఘమా? లేకా మోదీ ప్రభుత్వమా? చెప్పాలన్నారు. నిజానికి ప్రకృతి విపత్తుల సమయంలో.. చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చు. కానీ.. అలాంటి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో.. సీఎస్ లేరు. అందుకే… పరిస్థితుల్ని ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి.. కోడ్ సడలింపు గురించి మాట్లాడటం లేదు. ఏం జరిగితే అది జరుగుతుందన్నట్లుగా.. బిందాస్‌గా ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి.