నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ రెండు, మూడు రోజులుగా ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రకటనలు చేస్తున్నారు. బీజేపయేతర పక్షాల కూటమి నుంచి.. ప్రధానిగా రాహుల్ కన్నా చంద్రబాబే బెటరని ప్రకటనలు చేస్తున్నారు. మాయావతి, మమతా బెనర్జీలు కూడా.. సమర్థులని చెబుతున్నారు. తాను మాత్రం ప్రధానమంత్రి పదవికి పోటీకి రావడం లేదని.. తాను కింగ్ మేకర్‌గానే ఉంటానని చెబుతున్నారు. శరద్ పవార్ ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటన్నదానిపై రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ప్రధాని కావడం శరద్ పవార్ కల..! దాని కోసమే కొత్త వ్యూహం..!
శరద్ పవార్.. కింగ్ మేకర్ గా ఉంటానని ప్రకటించుకున్నా కూడా… ఆయన లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ప్రధాని పదవి కోసమే.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. సోనియాను ధిక్కరించి సొంత పార్టీ పెట్టుకున్నారు. శరద్ పవార్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉండవచ్చు కానీ.. ఆయనకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శివసేనతోనూ… మిత్రృత్వం ఉంది. ప్రధాని పదవికి శరద్ పవార్ పేరు వస్తే.. శివసేన కచ్చితంగా మద్దతు తెలుపుతుంది. అందుకే.. ఎన్డీఏ పక్షాలు కూడా … మద్దతు తెలుపుతాయని.. నర్మగర్భంగా ప్రకటన కూడా చేశారు. టీఆర్ఎస, వైసీపీ లాంటి పార్టీలు… మద్దతిచ్చే అవకాశం ఉంది. శరద్ పవార్ ప్రకటన ప్రకారం.. చంద్రబాబు, మాయావతి, మమతా బెనర్జీ పేర్లు తర్వాత తన పేరును ఉంచుకున్నారు. కానీ బహిరంగంగా ప్రకటించడం లేదు. సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించని నేత శరద్ పవార్. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎలా అంగీకరిస్తారు..?
పరోక్షంగా తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని తెరపైకి తీసుకు వచ్చారు..!
కాంగ్రెస్ పార్టీ కూటమిలోని భాగస్వామి శరద్ పవార్. యూపీఏలో భాగస్వామిగా ఉండి… కూడా… ఆయన ప్రధాని పదవి గురించి.. కామెంట్ చేస్తున్నారు. కూటమి నాయకుడిగా.. రాహుల్ గాంధీకే ప్రధాని పదవి రావాలని ఎవరైనా చెబుతారు. కానీ పవార్ మాత్రం… తాను ఉన్న కూటమిలోని నేతను మాత్రం.. ప్రధానిగా వద్దని అంటున్నారు. ప్రధానిగా రాహుల్ కన్నా.. చంద్రబాబు బెటరని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తే… శరద్ పవార్.. ఇలాంటి ప్రకటన చేయడం లో… చంద్రబాబును ప్రధానిని చేయడం కన్నా… తాను ప్రధానమంత్రి రేసులో ముందుకు రావాలన్న ఆలోచన ఉందని అనుకోవాలి. రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాకూడదంటున్న ఆయన ముగ్గురు పేర్లు చెబుతున్నారు. సీనియార్టీ ప్రకారం తీసుకున్నా.. ఈ ముగ్గురు నేతలు కీలకమైన వ్యక్తులు. ఆ ముగ్గురు కాకపోతే… తాను రేసులో ఉంటానని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి లేకపోతే తీవ్ర నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత.. తాను అనుకున్నట్లుగా రాజకీయం లేకపోతే..బీజేపీయేతర పార్టీల నుంచి.. ఎన్డీఏకు వెళ్లే మొట్టమొదటి పార్టీ ఎన్సీపీ. శరద్ పవార్‌కు.. బీజేపీ, శివసేనలతో సన్నిహిత సంబంధాలున్నాయి. శివసేనతో రగడ జరగినపపుడు… బీజేపీ.. ఎన్సీపీతో చర్చలు జరిపిందని కూడా ప్రచారం జరిగింది. ఇదంతా చూస్తే… శరద్ పవార్.. తన ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆశలను అలా ముందుకు తెచ్చి పెడుడుతున్నారు.
అవకాశం వస్తే బీజేపీ మద్దతుతో ప్రధాని అయ్యేందుకు ఈ వ్యహాలు…!
కూటమిలో ఉండి.. కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పోటీ చేస్తున్న శరద్ పవార్.. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తే ఎవరికి నష్టం…?. తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ యూపీలో… మాయావతితో.. బెంగాల్లో… మమతా బెనర్జీతోనూ పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో… శరద్ పవార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది. అయినప్పటికీ.. అదే మాటలు చెబుతున్నారు. బీజేపీకి.. సంతోషాన్ని కలిగిస్తున్నారు. రేపు ప్రాంతీయ పార్టీలు బలమైన సీట్లు సాధిస్తే… బీజేపీ మద్దతుతోనే లేకపోతే… ప్రాంతీయ పార్టీల మద్దతుతోనో.. తానే ప్రధాని కావాలని… పవార్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాహుల్ ప్రధాని కాకూడదని.. అంటే.. ముందుగా ఆనందపడేది బీజేపీ నేతలే.