రామ్ గోపాల్ వర్మ నడి రోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని… అందరూ రావాలని పిలుపునిచ్చి.. హంగామా చేయడానికి సిద్ధమవడంతో.. పోలీసులు… విమానాశ్రయం నుంచే వెనక్కి పంపేశారు. దానిపై.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ట్విట్టర్ వేదికగా బాధపడ్డారు. ఇదేం ప్రజాస్వామ్యం అని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే.. ఎనలేని గౌరవం ఉండే జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యకరం కాదు కానీ..ట్వీట్ చివరిలో “చంద్రబాబుగారూ…! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?” అని క్వశ్చన్ పెట్టడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు చంద్రబాబు… ఓ కానిస్టేబుల్కు ఆదేశం ఇవ్వాలని… ఎన్నికల సంఘం పర్మిషన్ కావాల్సిందే. రాజ్యాంగంలో ప్రజా ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నా.. కోడ్ పేరుతో… సొంత రాజ్యాంగం ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. ఇప్పుడు పాలన చంద్రబాబు చేతుల్లోంచి వెళ్లిపోయింది. ద్వివేదీ, సీఎస్ ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వకుండా చేసి… ఈసీ, సీఎస్ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ… రాజకీయ అజెండాతో సమీక్షలు చేస్తున్న తీరు… ఇప్పటికే ప్రజాస్వామ్య వాదుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు జరిగినందున.. చంద్రబాబు ఆపద్దర్మ సీఎం అంటూ.. ఆయన కనీసం.. తన ఇంట్లో పార్టీ నేతలతో కూడా సమావేశం కాకూడదంటూ… ఫిర్యాదులు చేసి.. ఆ మేరకు.. ఈసీతో సర్క్యులర్లు ఇప్పించుకున్నారు వైసీపీ నేతలు. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి… రామ్గోపాల్ వర్మను పోలీసులు… శాంతిభద్రతలను చెడగొట్టేందుకు వచ్చారన్న కారణంతో.. వెనక్కి పంపితే.. ఆ నిందను చంద్రబాబుపై వేయడానికి ఏ మాత్రం.. ఆలోచించలేదు.
దేశంలో ఎక్కడా అమలు చేయని నిబంధనలు ఏపీలో అమలు చేస్తున్నారు. చంద్రబాబును కనీసం రెండు నెలల పాటు అయినా అధికారానికి దూరం చేయాలనే తాపత్రయం.. ఢిల్లీ నుంచి జగన్ వరకూ కనిపిస్తోంది. అందుకే… పదే పదే ఫిర్యాదులతో.. సొంత కోడ్ విడుదల చేసి..సీఎంకు ఏ అధికారాలు లేవని చెప్పి..అధికారులే ప్రభుత్వాన్ని సొంతంగా నడిపేస్తున్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య హనన పరిస్థితిని తెచ్చి పెట్టిన వారిని జగన్ అడగాలి. తనను తాను అడగలేరు కాబట్టి.. కనీసం.. పోలీసు వ్యవస్థ అధీనంలో ఉంచున్న ఈసీ, ఎల్వీలను అయినా అడగాలి. చంద్రబాబును అడిగితే.. కామెడీ అవుతుంది.