రాహుల్ గాంధీ..ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో… ఇంత వరకూ ఓటమి ఎదుర్కొలేదు. కానీ ఈ సారి ఆయన… కేంద్రమంత్రి స్మృతిఇరానీతో… గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తూండటంతో… ఓటమి భయంతోనే పారిపోయారన్న ప్రచారాన్ని బీజేపీ ఉద్ధృతం చేస్తోంది. అక్కడి ప్రజలకు.. రాహుల్ గాందీకి ఓటు వేయకపోయినా… ఆయన వయనాడ్ నుంచి గెలుస్తారని చెప్పి… స్మృతి ఇరానీకి ఓటు వేయమనేలా.. ప్రచారం చేస్తున్నారు. అయితే.. అమేథీలో.. రాహుల్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారని అంచనా వేస్తున్నారు కానీ.. ఆయన ఓడిపోతారని మాత్రం… ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. ఆ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ నేతల మాటల్లో బయట పడుతోంది.
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ.. ఈ నమ్మకాన్ని తన మాటల్లో మరోసారి వ్యక్తం చేశారు. అమేథీ నుంచి… రాహుల్ గాంధీ ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని నేరుగా .. బీజేపీ నేతలకు సవాల్ చేశారు. నిజానికి సిద్ధూకి ఉత్తరప్రదేశ్‌కు సంబంధం లేదు. పంజాబ్‌కు చెందిన నేత సిద్దూ. అయినా.. ఆయన అమేధీ గురించి సవాల్ చేసి.. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చారనుకోవాలి. సిద్ధూ… గతంలో బీజేపీలోనే ఉండేవారు. బీజేపీకి పెద్దగా బలం లేని… మిత్రపక్షం అకాలీదశ్ మీద మాత్రమే ఆధారపడే పంజాబాద్‌లో.. సిద్ధూ కీలక నేతగా ఉండేవారు. అమృతసర్ నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే… బీజేపీలో మోడీ హవా ప్రారంభమయ్యే ముందే… సిద్దూకు గడ్డుకాలం వచ్చింది. అమృత్సర్ నుంచి… అరుణ్ జైట్లీని పోటీ చేయించడానికి 2014లో ఆయనకు టిక్కెట్ నిరాకరించారు బీజేపీ అగ్రనేతలు. అప్పట్నుంచి అసంతృప్తికి గురై.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. కీలకంగా వ్యవహరించారు. ఓ దశలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అయితే… సీనియర్ గా అమరీందర్ సింగ్ పోటీలోకి రావడంతో.., వెనక్కి తగ్గారు. ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి.. తన విధానాన్ని ఆ పార్టీకి అనుకూలంగా మార్చుకున్న సిద్దూ… అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల సానుకూల భావన చూపిస్తూంటారు. పుల్వామా దాడి ఘటనలో… ఎవరో కొంత మంది చేసిన తప్పును.. మొత్తం పాకిస్తాన్ పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. ప్రకటించి.. వివాదాస్పదం అయ్యారు. ఈ ఎన్నికల్లో… ముస్లింలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చి.. ఈసీ ఆగ్రహానికి కూడా గురయ్యారు. తాజాగా.. రాహుల్ గాంధీ కోసం..నేరుగా బీజేపీనే సవాల్ చేస్తున్నారు. ఎలాంటి పిచ్‌పై అయినా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉందని..సిద్ధూ నిరూపించుకుంటున్నారు.