తెలంగాణలో ప్రతిపక్ష నేతల అరెస్టులు.. ఆదివారం ఆర్థరాత్రి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ బోర్డులోని అవకతవకలు, విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే డిమాండ్‌తో.. విపక్ష పార్టీలన్నీ.. ఈ రోజు.. భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. చలో ఇంటర్ బోర్డు కార్యక్రమాన్ని ప్రకటించాయి. అన్ని జిల్లాల నుంచి… తరలి రావాలని… అన్ని పార్టీలు తమ కార్యకర్తలను కోరాయి. టీజేఏస్ అధినేత కోదండరాం.. ఈ ముట్టడిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిపై.. పోలీసులు ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచే.. ఎక్కడిక్కకడ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా టీజేఎస్ నేత కోదండరాం, వామపక్ష నేతలు, జంట నగరాల్లోని కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.
కరీంనగర్, వరంగల్ లాంటి చోట్లనుంచి ఇంటర్ బోర్డు ముట్టడికి వస్తారనుకున్న కాంగ్రెస్ నేతల్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇంటర్ బోర్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఎలాంటి ఆందోళనకు అనుమతి లేదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే.. అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరో వైపు… భారతీయ జనతా పార్టీ కూడా.. ఈ ఆందోళనకు మద్దతు తెలిపింది. ఆ పార్టీ నేత లక్ష్మణ్.. నివరధిక నిరాహారదీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టిడికి.. టీ టీడీపీ నేతలు ప్రయత్నించారు. అక్కడ ఎల్.రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేతలందర్నీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ.. విద్యార్థి సంఘాల నేతలు మాత్రం… దూకుడుగా.. ఇంటర్ బోర్డు వద్దకు వచ్చారు. అయితే.. వచ్చిన వారిని.. వచ్చినట్లు పోలీసులు అరెస్ట్ చేసి… తీసుకెళ్లిపోయారు.
ముందస్తుగా అరెస్ట్ చేయడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భగ్గుమన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచలేమన్న ఆయన ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇంటర్ అక్రమాలపై ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత… టీఆర్ఎస్లో వరుస చేరికలతో…. తెలంగాణ రాజకీయం అంతా వన్ సైడ్‌గా మారిపోయిందన్న ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో… ఇంటర్ బోర్డు అక్రమాలపై పోరాటంతో.. విపక్షాలు.. బలంగా.. ప్రజల్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత నిర్బంధం ఉన్నప్పటికీ.. వారు చేస్తున్న పోరాటం.. ప్రతిపక్షాలు.. నిర్వీర్యం కాలేదని నిరూపిస్తున్నాయి.