లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలు మే ఒకటో తేదీన విడుదల చేస్తామన రామ్గోపాల్ వర్మ మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి… సినిమా ప్రమోషన్ చేస్తానని.. నిజం చెబుతానని హడావుడి చేశారు. ఆయన చేసిన ప్రకటన…. ఏదో రాజకీయ కుట్ర ఉందన్న కోణంలో ఉండటంతో.. విడయవాడ పోలీసులు ఎన్నికల నిబంధనలు గురించి చెప్పి.. వెనక్కి పంపేశారు. ఆ ఘటన కేంద్రంగా కావాల్సినంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు… రామ్గోపాల్ వర్మ. విజయవాడ నుంచి పోలీసులు వెనక్కి పంపిన తర్వాత హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి.. మళ్లీ ఒకటో తేదీన సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు.
అసలు.. సినిమా విడుదల చేయడానికి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చిందా.. లేదా అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం… కొన్నాళ్ల క్రితమే.. ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఏ రాజకీయ నాయకుడి బయోపిక్ అయినా సరే విడుదల చేయడానికి లేదని.. ఆ సర్క్యూలర్ సారాంశం. దీని ఆధారంగా.. ఏపీ ఎన్నికల సంఘం కూడా.. ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు… ఈసీ ఇదే సర్క్యులర్గా హైకోర్టుకు సమర్పించడంతో… హైకోర్టు విచారణ ముగించింది. ఈసీ ఆదేశాల కారణంగా.. ప్రధాని మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్ర మోదీ’ కూడా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ మే 23వ తేదీ వరకూ ఉంటుంది. ఆ తర్వాతే.. బయోపిక్ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయినా… ఇప్పుడు ఎందుకు.. ఒకటో తేదీనే.. విడుదల చేయబోతున్నామని.. ఆర్జీవీతో పాటు.. సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకేష్ రెడ్డి ఎందుకు హడావుడి చేస్తున్నారోనని.. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై ఈసీ కూడా సైలెంట్ గాఉంది. ఈసీ పర్మిషన్ ఇచ్చిందో లేదో అధికారిక ప్రకటన లేదు. అయితే వైసీపీ నేతలు ఎన్నికల సంఘంతో.. రాసుకు పూసుకు తిరగుతూండటంతో… రహస్యంగా పర్మిషన్ ఇచ్చారేమోనన్న అనుమానాలు.. మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.