విజయసాయిరెడ్డి.. ట్విట్టర్లో చేస్తున్న వ్యాఖ్యలకు.. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు… కుటుంబరావుకు.. అంతకు మించి.. మాటలతో దాడి చేస్తున్నారు. సహజంగానే..విజయసాయిరెడ్డి ట్విట్టర్లో… దిగువ శ్రేణి, గలీజు మనస్థత్వం ఉన్న ఓ పార్టీ కార్యకర్త మాదిరిగా ట్వీట్లు చేస్తూంటారు. చాలా మంది ఆయనకు సంస్కారం లేదు పట్టించుకోవడం మానేశారు. రాజకీయాల్లో అంతే అనుకున్నారు. కానీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేని… ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాత్రం… లైట్ తీసుకోలేదు. ఇంత కాలం.. చంద్రబాబు, ఇతరలపై.. విమర్శలు చేసే విజయసాయిరెడ్డి.. ఇటీవలి కాలంలో.. కుటుంబరావును ఎక్కువగా టార్గెట్ చేశారు. ఆయనను… స్టార్ బ్రోకర్ అని విమర్శించడం ప్రారంభించారు.
స్టార్ బ్రోకర్ అనే పదం మొత్తం వాడితో పెద్దగా వివాదాస్పదం అయ్యేది కాదు కానీ… తర్వాత స్టాక్ తీసేసి… బ్రోకర్ అనడం ప్రారంభించారు. దీంతో.. కుటుంబరావు .. అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే.. విజయసాయిరెడ్డిలా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించడం లేద. నేరుగా మీడియా ముందుకు వచ్చే చెలరేగిపోతున్నారు. విజయసాయిరెడ్డిని పిచ్చి కుక్క అనేసి మరీ… విమర్శిస్తున్నారు. రాష్ట్ర అప్పులు పెరిగాయంటూ విజయసాయిరెడ్డి పిచ్చి కుక్కలా అరుస్తున్నారని… కుటుంబరావు విజయవాడలో మీడియా సమావేశంలో తడుముకోకుండా తిట్టేశారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి.. దొంగ ఆడిటర్ కాదా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై నాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. బెయిల్పై వచ్చి బతుకుతున్న విజయసాయిరెడ్డి ఓ పిచ్చి కుక్క అని మండి పడ్డారు. కేంద్రాన్ని నిధులు అడిగితే జైలు శిక్ష పడుతుందని జగన్, సాయిరెడ్డికి భయమన్నారు. ప్రాధాన్యత లేకుండా ప్రభుత్వం ఖర్చు చేస్తోందనడం సిగ్గుచేటని మండి పడ్డారు.
విజయసాయిరెడ్డి.. అర్థం పర్థం లేని ట్వీట్లు చేయడం.. సాధారణ నెటిజన్లతో.. కూడా… ఘాటుగా..కౌంటర్లు ఇప్పించుకోవడం.. ఇటీవలి కాలంలో చాలా సార్లు జరిగింది. కొద్ది రోజుల కిందట.. చంద్రబాబు 1996 ఎన్నికల్లో ఐదు వందల నోట్లు పంచారని.. ట్వీట్ చేశారు. కానీ ఐదు వందల నోట్లు వచ్చింది 1997లో అనే సంగతి కూడా గుర్తు లేదా.. దొంగ లెక్కల ఆడిటర్ అని.. నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. అయితే.. విజయసాయిరెడ్డి అలాంటివేమీ పట్టించుకోరు. తాను అనాల్సినవి అని స్వయంతృప్తి పొందారు. మరి ఇప్పుడు కుటుంబరావు ఇచ్చిన “పిచ్చి కుక్క” అనే బిరుదుపైనైనా… నేరుగా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తారో లేదో మరి..!