అమరావతిపై గురి పెట్టిన వైసీపీ లక్ష్యాన్ని ముందుగానే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నారనే ప్రచారం అమరావతిలో ఊపందుకుంటోంది. రాజధాని నిర్మాణాలకు అవసరమైన ఇసుక తవ్వకాలను నిలిపి వేయాలని… ప్రభుత్వం తరపున అదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గత రెండు, మూడు రోజులుగా.. అమరావతిలో పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణాలకు ఇసుక అందడం లేదు. దాదాపుగా.. రూ.50 వేల కోట్లకుపైగా పనులు.. రాజధానిలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు… ఇసుక రవాణాను నిలిపివేసేలా.. ఆదేశాలివ్వడంతో.. నిర్మాణ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.
పనులు నిలిపివేయాల్సిన పరిస్థితి రావడంతో… ఇసుక కొరత ఏర్పడిందంటూ.. హైకోర్టును ఆశ్రయించింది రాజధాని పనుల నిర్మాణ సంస్థ. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ… ఎన్నికల హడావుడిలో ఉండగా… ఢిల్లీలోని ఎన్జీటీ… ఏపీ ప్రభుత్వంపై రూ. వంద కోట్ల జరిమానా విధించింది. ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని ..దాఖలైన పిటిషన్ పై విచారణ డిరిపి.. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది గ్రీన్ ట్రిబ్యునల్. ఈ మేరకు.. విచారణకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లారు. అయితే.. రాజధాని నిర్మాణాలకు.. ఇతర అవసరాలకు… ఇబ్బందికరం అవుతుందని.. నిబంధనల మేరకు.. ఇసుక తవ్వకాలను కొనసాగించే విషయంలో… ఎలాంటి వాదన వినిపించలేకపోయారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అప్పట్నుంచి… ఇసుక తవ్వకాలు నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వాన్ని తామే నడుపుతున్నట్లు ఫీలవుతున్న అధికారులు కూడా.. సైలెంటయిపోయారు. పనులు ఆగిపోతే… ఆ భారం తీవ్రంగా ఉంటుందన్న ఆలోచన కూడా చేయడం లేదన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి. ఇసుక కోసం రాజధాని నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది.