రాజ్యాంగం ప్రకారం.. అందరూ సమానమే. రూల్స్ అంటే రూల్సే. కానీ అమలు చేసే వ్యక్తుల వల్లే తేడాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థల నిర్వాహకుల తీరు దేశాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజాతీర్పు కోరుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా ప్రజాతీర్పు కోరింది. కేంద్రం… ఇంకా మూడు దశల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. అంటే.. కోడ్ సంపూర్ణంగా వారికి అమల్లోకి ఉంటుంది. ఏపీలో.. ప్రజాతీర్పు ఈవీఎంలలో ఉంది. కాబట్టి కోడ్ ఉన్నా .. లేకున్నా.. ఓటర్లను ప్రభావితం చేసేదేమీ ఉండదు. కానీ… స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల సంఘం… ఎన్నికల కోడ్ ను… కేంద్రంలోని ప్రభుత్వానికి ఓ రకంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో రకంగా అమలు చేస్తున్నారు. కేంద్రానికి కోడ్ లేదన్నట్లుగా చూసీచూడనట్లు ఉంటున్నారు. ఏపీ ప్రభుత్వానికి మాత్రం కనీస అధికారాలు లేవని సర్క్యూలర్లు జారీ చేస్తోంది.
అక్కడ ఈసీ.. తన స్వతంత్ర ప్రతిపత్తిని వదిలేసి… బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి దాసోహమయింది. ఇక్కడ ఈసీ… మాత్రం.. ఏపీ ప్రభుత్వంపై పెత్తనం చేస్తోంది. దానికి తాజా ఉదాహరణ కూడా బయటపడింది. దక్షిణాది రాష్ట్రాలకు పెనుముప్పుగా మారిన సైక్లోన్ ఫణి గురించి నరేంద్రమోదీ చాలా దగ్గరగా మానిటరింగ్ చేస్తున్నారని… కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఉన్న పళంగా..జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారని.. ఆ మేరకు సమావేశం ఏర్పాటు చేసి.. తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రధాని ఆదేశం మేరకు సదరు సమావేశం కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సాగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే… ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి .. ఏపీ ప్రభుత్వం పని చేయకుండా..కోడ్ పేరుతో… ఎన్నికలు అధికారులు అడ్డం పడుతున్నారు.
ముఖ్యమంత్రి తుపాను సహాయ చర్యలపై సమీక్ష చేయాలంటే… తమ పర్మిషన్ కావాలన్నట్లుగా.. అటు ఈసీతో పాటు సీఎస్ వ్యవహరిస్తున్నారు. నిజానికి.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. ముఖ్యమంత్రి ఎలాంటి సమావేశాలను.. సమీక్షలను అయినా నిర్వహించడానికి అవకాశం ఉంది. ఈ మేరకు..సీఈవో విడుదల చేసిన మార్గదర్శకాల్లోనే ఉంది. కానీ సీఎస్ ఇంత వరకూ.. పరిస్థితిని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదు. ఆ ఆలోచన ఉన్నట్లుగా కూడా వ్యవహరించలేదు. ముందస్తు ప్రణాళికలు లేకుండా తుపానును ఎదుర్కోవడానికి రెడీ అన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. ఆర్థిక పరంగా.. ఎలాంటి అనుమతులు కావాలన్న..తప్పనిసరిగా సీఎం అనుమతి ఉండాల్సిందే. ఈ విషయంలోనూ.. అధికారులు … ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నార్న విమర్శలు వస్తున్నాయి. కేంద్రం కూడా.. ప్రజాతీర్పును కోరుతోంది. పైగా అక్కడ ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అయినప్పటికీ… రాజకీయ ఎజెండాతో.. కోడ్ పేరుతో..సొంత పాలన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. ఈసీ వెనుకడుగు వేయడం లేదు.