మే ఒకటిన ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేస్తామని హడావుడి చేసిన రామ్‌గోపాల్ వర్మకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తాము ఆ సినిమాను విడుదల చేయడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వడం కానీ… ఆంక్షలు సడలించడం కానీ చేయలేదని.. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. నిజానికి రామ్ గోపాల్ వర్మ… ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన.. ఈసీకి ఓ లేఖ రాశారు. అందులో… మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు అనుమతివ్వాలని… కోరారు. ఈసీ దానిపై ఎలాంటి నిర్ణయం చెప్పక ముందే.. రామ్ గోపాల్ వర్మ.. ఒకటో తేదీన సినిమా విడుదల అంటూ పోస్టర్లేశారు.
సోషల్ మీడియాలో హంగామా ప్రారంభించారు. ప్రమోషన్ కోసం అంటూ… విజయవాడకు వెళ్లి హడావుడి చేశారు. ఈ ఘటనల నేపధ్యంలో.. ఈసీ.. ఆర్జీవీ రాసిన లేఖకు స్పందన తెలియచేసింది. దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ…ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని .. ఆ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ద్వివేదీ స్పష్టం చేశారు. ఆ సినిమా విడుదలకు సంబంధించి.. ఈసీ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని కలెక్టర్లకు ఈసీ సమాచారం పంపింది. కొద్ది రోజులుగా.. ఎన్నికల సంఘం.. పూర్తి స్థాయిలో .. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
ఈ తరుణంలోనే ఆర్జీవీ… ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిచి మరీ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారాన్ని ప్రారంభించారు. అయినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో… వైసీపీ నేతలు పర్మిషన్ ఇప్పించి ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ.. రిలీజ్ కు ముందు రోజు మాత్రం.. దీనిపై ఈసీక్లారిటీ ఇచ్చింది. ఫలితాల తర్వాతే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుంది.