వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… సవాల్ చేసి మరీ సమీక్షా సమావేశం పెట్టారు. కానీ అధికారులెవరూ హాజరు కాలేదు. రెండు గంటల పాటు..సోమిరెడ్డి తన చాంబర్లో వెయిట్ చేసి వెళ్లిపోయారు. సమీక్షల అంశం కొద్ది రోజులుగా… అటు మంత్రులకు.. ఇటు అధికారవర్గాలకు మధ్య… ఒక వార్‌లా మారింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి… ప్రభుత్వం ఆపద్దర్మ ప్రభుత్వం అన్నట్లుగా.. ఏ పనీ చేయడానికి లేదన్నట్లుగా.. ఎలాంటి సమీక్షలు నిర్వహించడానికి లేదన్నట్లుగా… సీఈవో ద్వివేదీ సర్క్యులర్లు విడుదల చేశారు. ఆ ప్రభావంతో..అధికారులు డైలమాలో పడ్డారు. ఈ గందరగోళంపై.. గతంలోనే సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సమీక్ష పెడతానని.. అధికారులు రాకపోతే..సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు. అన్నట్లుగానే సమీక్ష పెట్టారు. కానీ అధికారులు రాలేదు.
నిజానికి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎలాంటి కోడ్ అడ్డంకులు ఉండవు. ముఖ్యమంత్రి సంపూర్ణ అధికారాలతో…ప్రభుత్వాన్ని నడపవచ్చు. అయినప్పటికీ.. ఇప్పుడు…ప్రకృతి వైపరీత్యం ఏమిటన్నదానిపై..ఈసీ ఎలాంటి… సర్క్యులర్లు జారీ చేయడం లేదు. ఓ వైపు..మంచినీటి ఎద్దడి, అకాల వర్షాలతో పంట నష్టం, మరో వైపు తుపాను కారణంగా.. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై… ముఖ్యమంత్రి సమీక్షించడానికి కూడా సీఈవో ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పుడు..సోమిరెడ్డి..సమీక్ష సందర్భంగా,… ఇవే అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు అధికారవర్గాలకు సమాచారం ఇచ్చారు. దీని వెనుక కూడా.. సోమిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అధికారులు సమీక్షకు రాకపోవడాన్ని..అధారాలతోసహా తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచన.. టీడీపీ వర్గాలు చేస్తున్నాయంటున్నారు.
ఓ రకంగా ఏపీలో కేంద్ర పాలన సాగుతోంది. ఈసీ నియమించిన సీఎస్…ముఖ్యమంత్రికి అధికారాలు లేవని నేరుగా చెప్పే పరిస్థితి ఉంది. నిజానికి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. తీర్పు ఈవీఎంలలో ఉంది. ఇలాంటి సమయంలో కోడ్‌కు సడలింపు ఇస్తారు. కానీ.. అలాంటిదేమీ ఇవ్వకుండా కేంద్ర పాలన సాగిస్తున్నారు. దానికి తమకు ఉన్న విశేషాధికారాలను ఈసీ చూపిస్తోంది. ఓ రకంగా ప్రజా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేశారు. ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ…సుప్రీంకోర్టులో కేసు వేయడానికే..సోమిరెడ్డి..సమీక్ష నిర్వహించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.