భారతీయ పురాణాలు, కథల్లో “యతి” అనే స్పెషల్ క్యారెక్టర్ ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడా యతి ఉనికి ఇండియన్ ఆర్మీ హిమాలయాల్లో గుర్తించింది. యతి అడుగుల గురించి ఇండియన్ ఆర్మీనే నిర్దారించింది. నేపాల్ సమీపంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది. ఈ కలికాలంలో యతి ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? యతి అడుగుజాడలు నిజంగా కనిపిస్తాయా? ఆర్మీ ఎందుకిలా చెబుతోంది..? యతిగా చెబుతున్న పాదముద్రలు 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పు ఉన్నాయట. వీటిని నేపాల్ సమీపంలో మకలు బేస్ క్యాంప్ సమీపంలో గుర్తించారు. ఏప్రిల్ 9న సైనికుల బృందం హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లింది.
నేపాల్ సమీపంలో మకలు బేస్ క్యాంప్ సమీపంలో యతి అడుగులను బృందం గుర్తించింది. ఆర్మీ అధికారులు కచ్చితంగా ఈ అడుగులు యతివే అంటున్నారు. ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్ చేసింది. పదిరోజులుగా వీటిని పరిశీలించి, గతంలో యతికి సంబంధించిన ఆనవాళ్లతో పోల్చిచూసిన తర్వాతే తాము ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని ఆర్మీ ప్రకటించింది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఫోటోలు, విడియోలను తదుపరి పరిశోధనల కోసం శాస్త్రవేత్తలకు అందించినట్లు సైన్యం తెలిపింది. అయితే.. రెండు కాళ్లతో నడుస్తుందని చెప్పిన ఆర్మీ అధికారులు.. విడుదల చేసిన ఫోటల్లో మాత్రం.. ఒక కాలు పాదముద్రలే ఉన్నాయి కానీ .. రెండు కాళ్లతో నడిచినట్టు లేవు. శతాబ్దాలుగా మిస్టరీగా మిగిలిపోయిన యతి ప్రచారం ఛేదించామనే అంటోంది ఇండియన్ ఆర్మీ.
ఆర్మీ ప్రకటన చాలా మందిలో ఓ రకమైన ఆశ్చర్యం కలిగించింది. కొంత మంది మరీ ఇంత అతి చేస్తున్నారేమిటన్న ఆలోచనల్లో మునిగిపోతున్నారు. బీజేపీ ఇక దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని… ఓమర్ అబ్దుల్లా లాంటి నేతలు సెటైర్లు వేస్తే… చివరికి యతి కూడా కనిపించిది కానీ… మోడీ చెప్పిన అచ్చేదిన్ మాత్రం ఇంకా రాలేదని… అఖిలేష్ యాదవ్ లాంటి నేతలు సూటిగా ట్వీట్లు చేశారు.