లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంది ఎన్నికల కమిషన్. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మకు ఈ ఉదయానికి క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి నిన్నటి వరకూ.. తన అద్భుత కళాఖండాన్ని.. ఇంకా చెప్పాలంటే.. తాను చెప్పాలనుకున్న నిజాన్ని… ఆపడానికి ప్రయత్నిస్తున్నారంటూ.. టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు రామ్ గోపాల్ వర్మ. సినిమా టిక్ డైలాగులు చెప్పారు. తాట తీస్తానన్నారు. ఇంకా.. ఏవోవో చాలెంజ్‌లు చేశారు. అయితే.. ఇప్పుడు.. తన సినిమాను అడ్డుకున్నది.. తాను చెప్పిన వాళ్లు కాదని.. ఎన్నికల సంఘమని..స్పష్టత వచ్చింది.
మరి రామ్ గోపాల్ వర్మ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? నిన్నటి దాకా చేసిన చాలెంజులన్నింటినీ.. ఈసీ మీద చేయడానికి సిద్ధంగా లేరా..?. రామ్ గోపాల్ వర్మ డిఫరెంట్ క్యారెక్టర్. ఆయనకు ఎవరినీ పొగడాల్సిన..తిట్టాల్సిన అవసరం ఉండదు. తాను ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. అందుకే… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో…చాలా డీప్ గా వెళ్లిపోయారు. ఏపీలో విడుదల చేస్తే.. తనకు ఏదో ఆస్కార్ వచ్చేస్తుదన్నంత హడావుడి చేశారు కానీ.. అసలు.. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలో..వాళ్ల దగ్గర తీసుకోలేదు. అయినా హడావుడి చేసి.. టీడీపీ పై..విరుచుకుపడ్డారు. పోలీసుల్ని నానా మాటలన్నారు.
ఇప్పుడు తాను చెప్పిందంతా..తప్పని తేలిపోయింది. మరి.. తన ఫైర్ ను… ఎన్నికల సంఘం మీద చూపించడానికి..రామ్ గోపాల్ వర్మ రెడీ అవుతారా..?. కుట్ర చేసి తాను చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పకుండా చేశారని…ఎన్నికల సంఘం మీద.. తొడ కొడతారా..?. అలా చేయకపోతే.. రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ను… సినీ ప్రేక్షకులు వేరేగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆర్జీవీ దీనిపై.. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది.