స్టార్ హీరో సినిమా అంటే కోట్లకు కోట్లు గుమ్మరించేస్తారు నిర్మాతలు.. అది ఆ స్టార్ హీరో ఇమేజ్ కు నిదర్శనం అయితే.. ఎంత పెట్టినా దానికి రెట్టింపు రాబట్టుకోవచ్చు అనే నిర్మాతల ఆలోచన. ఒకవేళ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అందకపోతే.. అప్పుడు పరిస్థితి ఏంటి.. అందుకే సినిమా చిత్రీకరణ దశలోనే సినిమాకు కావాల్సినంత బడ్జెట్ కేటాయించడం కరెక్ట్. అయితే సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా ఫారిన్ లొకేషన్స్ ఉండాల్సిందే..
అనుకున్న కథకు అవసరం ఉన్నా లేకున్నా స్టార్ హీరో అంటే నెల రోజుల పాటు ఫారిన్ లో షూట్ చేయాల్సిందే.. అయితే ఓవర్సీస్ కలక్షన్స్ కోసం అలా చేస్తున్నారా లేక సినిమాకు అవసరం కాబట్టే అలా చేస్తున్నారా అన్నది ఇక్కడ మ్యాటర్.. సినిమా బడ్జెట్ లో షూటింగ్ కు అసలు అయ్యే ఖర్చు కన్నా ఫారిన్ లొకేషన్స్ కు రెంట్లు.. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులే ఎక్కువవుతున్నాయని విశ్లేషణలో తెలిసింది.
ప్రస్తుతం స్టార్ హీరో అంటే ఫారిన్ షూట్ పెట్టాల్సిందే.. దర్శకులు తాము అనుకున్న కథకు న్యాయం చేయాలంటే ఫారిన్ అనే భావనలో నుండి బయటకు వచ్చి.. ఇక్కడే మంచి లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తే బెటర్. అవసరం ఉన్నా లేకున్నా ఫారిన్ షూట్ చేస్తే నిర్మాతకు డబ్బులు బొక్క తప్పించి పెద్దగా లాభం ఉండదు. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ కేవలం ఫారిన్ లోకేషన్స్ మీద ఆధారపడటం కాస్త విమర్శనాత్మకంగా ఉన్నా సబ్జెక్ట్ ఎంత గొప్పగా ఉన్నా చిత్రీకరణ విదేశీ లోకేషన్స్ లో కాకుండా మన దగ్గరే చేస్తే బెటర్ అంటున్నారు కొందరు సినిమా విమర్శకులు.