భారత ఎన్నికల సంఘం… అత్యంత వివాదాస్పదమైన మరో నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. సాంకేతికంగా.. ఎన్నో అనుమానాలు ఈసీ ముందు పెడుతున్నప్పటికీ.. ఒక్కటంటే… ఒక్క అనుమానాన్ని తీర్చేందుకు ఈసీ ముందుకు రాలేదు. అదే సమయంలో… ఓట్ల లెక్కింపు విషయంలో అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంది. ఇలా లెక్కించేందుకు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడాయి. దీనికి కారణం… ఈవీఎంలలో వేసిన ఓట్లకు.. వీవీ ప్యాట్లలో పడిన ఓట్లకు తేడా లేకుండా ఉండేలా నమ్మకం కోసం. ఈవీఎంలో… బీజేపీకి వంద ఓట్లు పడి.. వీవీ ప్యాట్లలో బీజేపీకి 101 ఓట్లు పడినా.. కచ్చితంగా ఫ్రాడ్ జరిగినట్లే. లోపం ఉన్నట్లే. అంటే.. కచ్చితంగా ఈవీఎంను మానిప్యులేట్ చేసుకునే చాన్స్ ఉన్నట్లే. దీన్ని నిరూపించడానికే విపక్షాలు వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కానీ ఎన్నికల సంఘం మాత్రం.. ఈవీఎం ఫ్రాడ్లను గుర్తించడానికి కూడా.. వెనుకడుగు వేస్తోంది. ఇప్పుడు.. వివాదాస్పదమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. దాని ప్రకారం.. ఈవీఎంలో పడిన ఓట్లకు… వీవీ ప్యాట్లలో పడిన ఓట్లకు సంబంధం లేకపోయినా… పట్టించుకోరట. ఈవీఎంలో వెయ్యి ఓట్లు పోలయితే.. వీవీ ప్యాట్లో ఎనిమిది వందల ఓట్లే ఉన్నా… పట్టించుకోరట. వీవీ ప్యాట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్క పూర్తి చేస్తారట. వాటినే… అంతిమంగా… ఫలితాన్ని ప్రకటించడానికి ఉపయోగిస్తారట. మరి ఈవీఎంలో పడిన ఆ రెండు వందల ఓట్లు ఎవరివి..? ఎలా పడ్డాయి..? అనే విషయంలో… క్లారిటీ మాత్రం ఇవ్వడానికి ఈసీ ఏ మాత్రం సిద్ధపడదట.
ఈసీ వ్యవహారం రాను రాను.. అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. వీవీ ప్యాట్ స్లిప్పులే ప్రామాణికం అయినప్పుడు… వీవీ ప్యాట్లను.. యాభై శాతం లెక్కించాలని.. డిమాండ్ చేస్తున్న విపక్షాల పట్ల.. ఈసీ వైఖరి అంత తేడాగా ఎందుకు ఉంది. వారికి ఎందుకు నమ్మకం కలిగించరు. వీవీ ప్యాట్లనే ఈసీ కూడా నమ్ముతోంది. అలాంటప్పుడు.. వీవీ ప్యాట్లనే.. లెక్కించి ఫలితాన్ని ప్రకటిచవచ్చు కదా..!. భారత ప్రజాస్వామ్యం నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. ఆ నమ్మకాన్ని ఈసీ కల్పించకపోగా.. అనాలోచిత నిర్ణయాలతో.. మరిన్ని అనుమానాలు కలిగేలా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.